State Bank India : ఎస్బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ .. ఇకపై డబ్బులు ఇంటికే డెలివరీ ..

State Bank India: కస్టమర్లకు ఎస్బీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారులకు కొత్త సర్వీస్ ను అందుబాటులో తీసుకొచ్చిది. ఈ సర్వీస్ తో ఏటీఎం లకు వెళ్లాల్సిన పని లేదు. అలాగే యూపీఐ పని చేయకపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ తన కస్టమర్లకు డోర్ స్టెప్ డెలివరీను తీసుకువచ్చింది. ఈ సర్వీస్ తో ఇంట్లో కూర్చొని డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. దీని కోసం కొంత […]

  • Published On:
State Bank India : ఎస్బీ ఐ కస్టమర్లకు గుడ్ న్యూస్ .. ఇకపై డబ్బులు ఇంటికే డెలివరీ ..

State Bank India: కస్టమర్లకు ఎస్బీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. వినియోగదారులకు కొత్త సర్వీస్ ను అందుబాటులో తీసుకొచ్చిది. ఈ సర్వీస్ తో ఏటీఎం లకు వెళ్లాల్సిన పని లేదు. అలాగే యూపీఐ పని చేయకపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ తన కస్టమర్లకు డోర్ స్టెప్ డెలివరీను తీసుకువచ్చింది. ఈ సర్వీస్ తో ఇంట్లో కూర్చొని డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. దీని కోసం కొంత ప్రాసెస్ ఉంటుంది. ఈ సర్వీస్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సర్వీస్ ను పొందడానికి ముందుగా ఎస్బీఐ డోర్ స్టెప్ సేవ కోసం నమోదు చేసుకోవాలి. ముందుగా మీరు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఎస్ బీఐ బ్యాంకు వికలాంగులకు నెలలో మూడు లావాదేవీలను ఉచితంగా చేసింది. ఈ సదుపాయాన్ని నెలలో మూడు సార్లు మించి ఉపయోగిస్తే రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం పొందడం కోసం ముందుగా డోర్ స్టెప్ డెలివరీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత మొబైల్ నెంబర్లు నమోదు చేయాలి. రిజిస్టర్ మొబైల్ కు వచ్చిన ఓటీపీ నమోదు చేసి కస్టమర్ తన పేరు, ఇమెయిల్, ఎంటర్ చేసి, టర్మ్-షరతును అంగీకరించాలి. రిజిస్ట్రేషన్ తర్వాత, డీఎస్‌బీ యాప్ నుండి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఇప్పుడు కస్టమర్ పిన్, ఇతర వివరాలతో యాప్‌ ని లాగిన్ చేయవచ్చు. ఇక్కడ మీ అడ్రస్ ను కూడా ఎంటర్ చేయాలి.

లాగిన్ తర్వాత డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఎస్‌బీఐని ఎంచుకోవాలి. ఇప్పుడు కస్టమర్ ఖాతా నంబర్‌లోని చివరి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి. తర్వాత కస్టమర్ల మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. తర్వాత డోర్‌స్టెప్‌ బ్యాంకింగ్‌ మొబైల్ యాప్‌లో ఓటీపీని నమోదు చేయలి. నిర్ధారణ తర్వాత మీ పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు కస్టమర్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా సర్వీసును ఎంచుకుని, లావాదేవీ మొత్తాన్ని నమోదు చేసి, లావాదేవీ మోడ్‌ను నమోదు చేయాలి. తర్వాత కస్టమర్ ఖాతా నుండి ఛార్జీ కట్‌ అవుతుంది. అప్పుడు అభ్యర్థన సంఖ్యను నమోదు చేయాలి. ఎస్‌ఎంఎస్‌ ద్వారా కస్టమర్‌కు నోటిఫికేషన్ వస్తుంది. కస్టమర్ ఇంటికి చేరుకున్న తర్వాత ధృవీకరించిన తర్వాత ఏజెంట్ వచ్చి డబ్బును అందజేస్తారు.

Must Read : Rashmika Mandana : విజయ్ పై ‘ నా ఫీలింగ్ ఇదే ‘ అని షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక మందన ..