IT Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. కొత్త నిర్ణయం తీసుకున్న టెక్ కంపెనీలు ..

IT Employees : టెక్ కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు కొత్త నిర్ణయం తీసుకున్నాయి. రూట్ మార్చిన టెక్ కంపెనీలు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి తమని తాము కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనూ మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి పెద్ద కంపెనీలు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. ఖర్చులను తగ్గించుకోవటం కోసం టెక్ కంపెనీలు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ […]

  • Published On:
IT Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్ .. కొత్త నిర్ణయం తీసుకున్న టెక్ కంపెనీలు ..

IT Employees : టెక్ కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు కొత్త నిర్ణయం తీసుకున్నాయి. రూట్ మార్చిన టెక్ కంపెనీలు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి తమని తాము కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనూ మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ వంటి పెద్ద కంపెనీలు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చాయి. ఖర్చులను తగ్గించుకోవటం కోసం టెక్ కంపెనీలు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ డౌన్‌టౌన్ సీటెల్‌లోని ఆరు-అంతస్తుల భవనాన్ని, బెల్లేవ్‌లోని స్ప్రింగ్ డిస్ట్రిక్ట్‌లోని 11-అంతస్తుల బ్లాక్ 6లో తన ఆఫీస్లను సబ్‌లీజ్ కు ఇవ్వాలని డిసైడ్ అయింది.

వీటితో పాటు మైక్రోసాఫ్ట్ సైతం వాషింగ్టన్‌, బెల్లేవ్‌ కార్యాలయాలను ఖాళీ చేయాలని డిసైడ్ అయింది. సాప్ట్ మార్కెట్ లో కొనుగోలుదారులు తక్కువగా ఉండటం వల్ల వారి వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేందుకు ఎక్కువ మంది విక్రేతలు ఉంటారు. అందుకే పెద్ద కంపెనీలు ఈ సమస్యను అధిగమించటం కోసం తమ ఆఫీస్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ 2024తో ముగియనున్న బెల్లేవ్‌లోని 26-అంతస్తుల సిటీ సెంటర్ ప్లాజా భవన్ లీజును తిరిగి పునరుద్ధరించనుందని తెలుస్తోంది.

ఈ కారణాలతో కంపెనీలు తమ ఆఫీస్ లను ఇతరులకు అద్దెకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాయి. ఇటీవల కంపెనీలు భారీగా ఉద్యోగాలను తొలగించాయి. ఇప్పటికీ ఆ తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో టెక్ కంపెనీలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అందించాలని నిర్ణయించాయి. రిమోట్ విధానంలో ఉద్యోగులకు పనిచేసే వీలును అందిస్తున్నాయి. మెటా ప్రతినిధి ట్రేసీ క్లేటన్ సీటెల్ ఉద్యోగులకు ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు వీలుకల్పిస్తున్నట్లు వార్తా పత్రికలకు వెల్లడించారు. దీంతో కంపెనీలు ఆర్థిక పరంగా మెరుగుపడేందుకు కష్టపడుతున్నాయని తెలుస్తుంది. దాదాపుగా 25 శాతం కార్యాలయాలు ఖాళీ అయినట్లు సమాచారం.

Must Read : Electric Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ .. కేవలం 55 వేలకే అదిరిపోయే స్కూటర్ ..