cow dung tractors: రైతులకు గుడ్ న్యూస్ .. ఆవు పేడతో నడిచే టాక్టర్లు వచ్చేసాయ్ ..

cow dung tractors: వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు ఎంతో అవసరం. వ్యవసాయ భూమిలో దుక్కి దున్నడం, దమ్ము చేయడం వంటి పనులకు ఇప్పుడు అందరూ ట్రాక్టర్ లనే వాడుతున్నారు.

  • Published On:
cow dung tractors: రైతులకు గుడ్ న్యూస్ .. ఆవు పేడతో నడిచే టాక్టర్లు వచ్చేసాయ్ ..

cow dung tractors: వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు ఎంతో అవసరం. వ్యవసాయ భూమిలో దుక్కి దున్నడం, దమ్ము చేయడం వంటి పనులకు ఇప్పుడు అందరూ ట్రాక్టర్ లనే వాడుతున్నారు. పూర్వం మన పెద్దవాళ్లు ఎద్దులతో భూమిని దున్ని పంటను సాగు చేసే వాళ్ళు. అది ఎంతో కష్టమైన పని అలాగే సమయం కూడా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు టాక్టర్లు రావడంతో వ్యవసాయం చేయడం సులభం అయిపోయింది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రైతులకు పెద్ద సమస్యగా తయారయింది. ట్రాక్టర్ రెంట్ కి, పెట్రోల్, డీజిల్ కి, కూలీలకు, ఎరువులకు ఇలా రకరకాల ఖర్చులు పెరిగిపోవడంతో రైతులకు వ్యవసాయంలో ఏం మిగలడం లేదు.

అయితే రైతులకు ఆ సమస్య నుంచి విముక్తి కలిగించడానికి శాస్త్రవేత్తలు సులభమైన మార్గాన్ని కనిపెట్టారు. ఆవు పేడతో ట్రాక్టర్ నడిచేలా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఇటలీ దేశానికి చెందిన న్యూ హోలాండ్ అగ్రికల్చర్ అనే వ్యవసాయ యంత్రాలను తయారు చేసే కంపెనీ ఆవు పేడతో నడిచే ట్రాక్టర్లను తయారుచేసింది. రైతుల కోసం లిక్విడ్ మీథేన్ గ్యాస్ తో నడిచే టి7 మోడల్ ట్రాక్టర్ ను తయారు చేసింది. ఆవు పేడతో 270 బీహెచ్పీ సామర్థ్యంతో ట్రాక్టర్ నడుస్తుంది. డీజిల్ తో నడిచే ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ బాగా నడుస్తుందని కంపెనీ తెలిపింది.

కనీసం 100 ఆవుల నుంచి సేకరించిన పేడను బయో మీథేన్ స్టోరేజ్ యూనిట్స్ లలో నిల్వ చేస్తారు. ఫ్యుజిటివ్ మీథేన్ అనే గ్యాస్ తక్కువ ఉద్గార ఇంధనంగా కంప్రెస్స్ అవుతుంది. దీనిని ఒక క్రయోజనిక్ ట్యాంక్ నీ ట్రాక్టర్ మీద ఏర్పాటు చేస్తారు. 162 డిగ్రీల ఉష్ణోగ్రతతో బయో మీథేన్ గ్యాస్ ను ద్రవ రూపంలో ఉండేలా చేస్తుంది. దీనివలన డీజిల్ ట్రాక్టర్ కంటే ఇది ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుంది. త్వరలోనే అన్ని దేశాలకు ఈ ట్రాక్టర్లను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే ఈ ట్రాక్టర్ భారత్ లో అడుగు పెట్టనుంది.

Must Read: Chiranjeevi : త్వరలోనే మరో ఇల్లు కట్టుకోబోతున్న చిరంజీవి .. ఎక్కడో తెలుసా ?