Portable House : ఈ ఇల్లుని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు .. నిమిషాల్లో సెట్ చేయవచ్చు ..

Portable House : ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్ట పడుతుంటారు. దీనికోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఇక సామాన్య ప్రజలకు సొంత ఇల్లు అనేది ఓ పెద్ద కల. దానికోసం ఎన్నో తిప్పలు పడుతుంటారు. అలాగే కష్టపడి కట్టుకున్న ఇల్లును ఎదో అవసరం కోసమని అమ్మాల్సి వచ్చినప్పుడు మనసు ఒప్పుకోదు. అలాగే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సొంత ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మనసుకు ఎంతో […]

  • Published On:
Portable House : ఈ ఇల్లుని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు .. నిమిషాల్లో సెట్ చేయవచ్చు ..

Portable House : ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్ట పడుతుంటారు. దీనికోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఇక సామాన్య ప్రజలకు సొంత ఇల్లు అనేది ఓ పెద్ద కల. దానికోసం ఎన్నో తిప్పలు పడుతుంటారు. అలాగే కష్టపడి కట్టుకున్న ఇల్లును ఎదో అవసరం కోసమని అమ్మాల్సి వచ్చినప్పుడు మనసు ఒప్పుకోదు. అలాగే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సొంత ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మనసుకు ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి.

అప్పటి వరకు అన్నేళ్లపాటు ఆ ఇంటితో అల్లుకున్న బంధాలు, జ్ఞాపకాలను మరిచిపోవడం అంటే అంత ఈజీ కాదు. అయితే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చూస్తే ఈ బాధ తొలగిపోతుంది. ఈ ఇంటిని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు. నిమిషాల వ్యవధిలోనే ఇంటిని మళ్లీ ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డబుల్ హౌస్ అని అంటారు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టూడియో అపార్ట్ మెంట్ లాగా ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి ఈ ఇల్లు సరిపోతుంది. ఇక బ్యాచ్ లర్స్ కు అయితే ఈ ఇల్లు బాగా సెట్ అవుతుంది.

అయితే ఈ ఇల్లు చాలా ఖర్చుతో కూడుకున్నది. దాదాపుగా 40 లక్షల దాకా ఈ ఇంటి ధర ఉంది. ఈ ఇల్లుని ఇండియా లో చాలా తక్కువ ధరకు తయారు చేయవచ్చు. విపత్తుల తర్వాత వేగంగా షెల్టర్ ఏర్పాటుకు ఈ నమూనా చక్కగా సరిపోతుంది. అందుబాటు ధరలకే ఇళ్లను అందించాలన్న మన సమస్యలకు ఆవిష్కరణలే సమాధానం అవుతాయి అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీని పేరు బాక్సబుల్ ఫోల్డింగ్ హౌస్. ఈ చిన్న ఇంట్లో ఒక కిచెన్, బెడ్ రూమ్, హాల్ ఉంటాయి. దీన్ని ఫోల్డ్ చేసి, కావాల్సిన చోట అన్ ఫోల్డ్ చేసుకోవచ్చు.

Must Read: LIC Policy : మహిళలకు గుడ్ న్యూస్ .. రూ.58 చెల్లిస్తే 8 లక్షలు రిటర్న్స్ ..