valter veeraiah movie running successfully in theatres : థియేటర్స్ లో దుమ్ము రేపుతున్న వాల్తేరు వీరయ్య సినిమా .. బాలయ్య సినిమా ఔటేనా ?

valter veeraiah movie running successfully in theatres : సంక్రాంతి కానుకగా బాలయ్య వీర సింహారెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత బాలయ్య చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు.

  • Published On:
valter veeraiah movie running successfully in theatres : థియేటర్స్ లో దుమ్ము రేపుతున్న వాల్తేరు వీరయ్య సినిమా .. బాలయ్య సినిమా ఔటేనా ?

valter veeraiah movie running successfully in theatres : సంక్రాంతి కానుకగా బాలయ్య వీర సింహారెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత బాలయ్య చిరంజీవి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతోనే థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డి సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. జనవరి 13న ఉంటే ఈరోజు వాల్తేరు వీరయ్య సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈరోజు ఉదయం నుంచి ధియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేశారు.

వాల్తేరు వీరయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 1200 కు పైగా థియేటర్లలో విడుదలైంది. దీంతో అన్ని థియేటర్ల వద్ద మెగా అభిమానులు సంబరం చేసుకుంటున్నారు. బెనిఫిట్ షోలకు ఫాన్స్ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన. డైరెక్టర్ బావి దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్లు సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా వాల్తేరు వీరయ్య సందడి మొదలైంది. విదేశాల్లో ప్రీమియర్స్ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

అమెరికాతో పాటు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మెగా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. థియేటర్స్ లో మెగా ఫాన్స్ నినాదాలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. మెగాస్టార్ అంటూ కేరింతలు కొడుతున్నారు. థియేటర్స్ వద్ద బాణ సంచాలు కాలుస్తూ పెద్ద ఎత్తున పండుగ చేస్తున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బాలకృష్ణ చిరంజీవి సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కంటెంట్ పరంగా ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ వసూళ్లపరంగా ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుందో మరికొద్ది రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది. ఏది ఏమైనా ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికి అభిమానులకు పండుగ వాతావరణం కనిపించే చేశాయి.

Must Read: ఈమె అందం…అందానికే అసూయ పుట్టేలా ఉందిగా..