Nuvvu naaku nacchav movie: వెంకటేష్ తో ఉన్న ఆ పిల్లాడు .. ఇప్పుడు ఒక స్టార్ హీరో.. గుర్తుపట్టారా !

Nuvvu naaku nacchav movie: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • Published On:
Nuvvu naaku nacchav movie: వెంకటేష్ తో ఉన్న ఆ పిల్లాడు .. ఇప్పుడు ఒక స్టార్ హీరో.. గుర్తుపట్టారా !

Nuvvu naaku nacchav movie: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటితోపాటు సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి ఫోటో ఒకటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తెలుగు పరిశ్రమలో స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ ఓ సినిమా షూటింగ్ సెట్ లో పిల్లలతో మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతుంది. ఈ ఫొటోలో వెంకటేష్ తో పాటు ఓ స్టార్ డైరెక్టర్ ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరో గా కొనసాగుతున్న స్టార్ హీరో ఉన్నారు.

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ హీరో కొనసాగుతున్న ప్రస్తుతం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానా తో పాటు కలిసి నటిస్తున్నాడు. త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ కు సంబంధించిన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి కారణం ఈ ఫొటోలో ఓ స్టార్ డైరెక్టర్ , ఓ స్టార్ హీరో ఉన్నారు. తెలుగులో ఎవర్ గ్రీన్ సినిమా ‘ నువ్వు నాకు నచ్చావ్ ‘ సినిమా షూటింగ్ సెట్లో పిల్లలతో మాట్లాడుతున్నారు వెంకటేష్.

వైరల్ అవుతున్న ఈ ఫొటోలో స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ ఉన్నారు. ఆయన ఈ ఫొటోలో నెత్తిన కర్చీఫ్ వేసుకొని దానిపై టోపీ పెట్టుకొని వెరైటీ గా కనిపించాడు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు డైలాగ్స్ రాశాడు త్రివిక్రమ్. అందుకే షూటింగ్ జరిగే దగ్గర వెంకటేష్ తో కలిసి ఉన్నాడు. అలాగే ఈ పిక్ లో బ్లాక్ టీ షర్ట్ వేసుకొని కనిపిస్తున్న పిల్లాడు మరెవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. టీనేజ్ లో రామ్ భలే క్యూట్ గా ఉన్నాడు అని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.