Guntur Kaaram : గుంటూరు కారం సెకండ్ సింగిల్…ఎలా ఉందో మీరే చూడండి…

Guntur Kaaram  : మహేష్ బాబు తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు ,కాలేజా వంటి క్రేజీ సినిమాలలో 3 వ సినిమా గా గుంటూరు కారం వస్తుంది. ఇది ఒక మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతుంది అని మూవీ టీమ్ ఇప్పటికే చెప్పేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిసున్నారు. అయితే ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ […]

  • Published On:
Guntur Kaaram  : గుంటూరు కారం సెకండ్ సింగిల్…ఎలా ఉందో మీరే చూడండి…

Guntur Kaaram  : మహేష్ బాబు తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు ,కాలేజా వంటి క్రేజీ సినిమాలలో 3 వ సినిమా గా గుంటూరు కారం వస్తుంది. ఇది ఒక మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతుంది అని మూవీ టీమ్ ఇప్పటికే చెప్పేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మిసున్నారు. అయితే ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు సిని బృందం సన్నాహాలు చేస్తుంది. అయితే సినిమాకు సంబంధించి ఇప్పటికే గ్లింప్సీ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుండి వాటికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇటీవల ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కాగా దానికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండో లిరికల్ సాంగ్ కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది.

guntur-karam-second-single-see-how-it-is

ఓ మై బేబీ అంటూ సాగే 2.59 నిడివి గల ఈ రొమాంటిక్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండిగా మారింది. అయితే ఈ పాట మహేష్ బాబు శ్రీ లీల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అని స్పష్టమైతుంది. అయితే ఈ పాట కి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించినగా శిల్పరావు పాడారు. ఆ కాఫ్ కప్పు లొ సుగర్ క్యూబ్ నువ్వే అంటూ మొదలైన ఈ సాంగ్ కి తమన్ అందించిన ట్యూన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండిగా మారింది. ఇకపోతే మహేష్ బాబు లవ్ స్టోరీ సినిమాలు తీసి చాలాకాలం అయింది .ఈమధ్య మహేష్ బాబు అన్ని దేశానికి సంబంధించిన మరియు మాస్ కమర్షియల్ మూవీ నే చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో కూడాలవ్ ఉన్న పెద్దగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోతుంది. అలాంటిది త్రివిక్రమ్ తో మహేష్ చేస్తున్న గుంటూరు కారంలో లవ్ రొమాంటిక్ యాంగిల్ ని బాగానే చూపించనున్నట్లు సమాచారం.ఇక సినిమా టైటిల్ చూస్తుంటేనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా కనిపిస్తుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గావిడుదలైన ఓ మై బేబీ సాంగ్ తో సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ ఉండబోతుందని అర్థమవుతుంది. రమణ గా కనిపిస్తున్న మహేష్ బాబు మరియు అమ్ముగా కనిపిస్తున్న శ్రిలీల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్క్ ఔట్ అవుతుందని ఈ సాంగ్ ద్వారా అర్ధం అవుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.