Adipurush Review : ఆది పురుష్ ఫుల్ రివ్యూ….హిట్టా ఫట్టా…

Adipurush Review : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ శ్రీరాముడిగా కృతి సనన్ సీతగా నటిస్తున్న లేటెస్ట్ పౌరాణిక చిత్రం ఆది పురుష్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడుగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించారు. ఇక హనుమంతుడి పాత్రలో దేవదత్త కనిపించారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించారు. అయితే ఈ […]

  • Published On:
Adipurush  Review : ఆది పురుష్ ఫుల్ రివ్యూ….హిట్టా ఫట్టా…

Adipurush Review : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ శ్రీరాముడిగా కృతి సనన్ సీతగా నటిస్తున్న లేటెస్ట్ పౌరాణిక చిత్రం ఆది పురుష్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో సన్నీ సింగ్ లక్ష్మణుడుగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించారు. ఇక హనుమంతుడి పాత్రలో దేవదత్త కనిపించారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించారు. అయితే ఈ సినిమా మొదట్లో భారీగా ట్రోల్స్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే.

మరి ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో ఎక్కువ ట్రోల్స్ వచ్చాయి. తరువాత వాటన్నింటినీ సరిదిద్దుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈరోజు విడుదలైన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి 1100 స్క్రీన్…కర్ణాటక 180 స్క్రీన్స్..తమిళనాడు 170 స్క్రీన్స్…కేరళ 150 స్క్రీన్స్.హిందీ మరియు వెస్ట్ ఆఫ్ భారత్ 3300 స్క్రీన్స్..ఓవర్సీస్ 2100 స్క్రీన్స్…వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 7000 + స్క్రీన్స్ లో భారీగా విడుదల చేశారు.

అయితే ఆర్ఆర్ఆర్ , బాహుబలి మరియు రాధే శ్యామ్ సినిమాతో ఇది చాలా తక్కువ అని చెప్పాలి. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్నిచోట్ల ప్రీమియర్ షోలు నడవడంతో సినిమా రివ్యూ బయటకు వచ్చింది. ట్విట్టర్ వేదికగా కొందరు ఈ సినిమా రివ్యూ ని చెప్పారు. ట్విట్టర్ ఆధారంగా వచ్చిన రివ్యూ చూస్తే ఆదిపురుష్ సినిమా ఎవరేజ్ అని అర్థమవుతుంది. అసలు సినిమా ఎలా ఉంది గ్రాఫిక్స్ వర్క్ ఎలా ఉంది అనే అంశాలను కొందరు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. వాటిలో కొన్ని మీకోసం…

 

ట్విట్టర్లో వచ్చిన రివ్యూ ఆధారంగా చూసుకుంటే..కొందరు సినిమా ఫస్ట్ అఫ్ బాగుందని , గ్రాఫిక్స్ బాగాలేదని అంటున్నారు. మరికొందరు సెకండ్ హాఫ్ కాస్త డల్ గా ఉందని అంటున్నారు. మరి కొంతమంది సినిమా గ్రాఫిక్స్ కార్టూన్ గ్రాఫిక్స్ లో ఉందని , ఈ సినిమాను పిల్లలు ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ సినిమాపై కొంత పాజిటివ్ టాక్ మాత్రం ఉంది. మరి లాంగ్ రన్ రేస్ లో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.