Adhurs Re Release : తారక్ అభిమానులకు గుడ్ న్యూస్… ఈనెల 18న 4k వర్షన్ తో అదుర్స్ సినిమాను రీ రిలీజ్

Adhurs Re Release : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా అదుర్స్. ఇక ఈ సినిమా 2010 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రలో నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. […]

  • Published On:
Adhurs Re Release : తారక్ అభిమానులకు గుడ్ న్యూస్… ఈనెల 18న 4k వర్షన్ తో అదుర్స్ సినిమాను రీ రిలీజ్

Adhurs Re Release : టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ వివి వినాయక దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా అదుర్స్. ఇక ఈ సినిమా 2010 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ చారి పాత్రలో నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు నయనతార మరియు షీలా హీరోయిన్స్ గా నటించారు.

adhurs-re-release-trailer-4k

ఇక ఈ సినిమాని కొడాలి నాని మరియు వల్లభినేని వంశీ సంయుక్తంగా కలిసి నిర్మించడం జరిగింది. అంతేకాక ఎన్టీఆర్ మరియు వివి వినాయక్ కాంబినేషన్లో అదుర్స్ సినిమా హ్యాట్రిక్ హిటుగా నిలిచింది. అంతకుముందే వీరిద్దరి కాంబినేషన్ లో ఆది , సాంబ వంటి సినిమాల వచ్చి సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన అదుర్స్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటాయి.

అయితే ప్రస్తుత కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇదే నేపథ్యంలో ఈనెల 18న 4k వర్షన్ తో అదుర్స్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లుగా మూవీ టీం తెలియజేసింది. అంతేకాక సినిమాకు సంబంధించి 4k వర్షన్ ట్రైలర్ ను కూడా ఇటీవల విడుదల చేసి అప్డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ట్రైలర్ పాత ట్రైలర్ తో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ న్యూస్ విన్న ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అదుర్స్ సినిమాను తెరపై చూసేందుకు సిద్ధంగా ఉన్నారు.