Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ పాటించడం మంచిది…

Diabetes : ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య షుగర్.ఒక్కసారి ఈ సుఖ సమస్య వచ్చినట్లయితే చాలా అప్రమత్తంగా ఉంటూ అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా షుగర్ వచ్చిందంటే ఒక భయం మొదలవుతుంది. ఏది తినాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచించి తినాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే డయాబెటిస్ బాధితులు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆహార నియంత్రణ వారి వ్యాధి తగ్గుదలకు […]

  • Published On:
Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఎలాంటి డైట్ పాటించడం మంచిది…

Diabetes : ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య షుగర్.ఒక్కసారి ఈ సుఖ సమస్య వచ్చినట్లయితే చాలా అప్రమత్తంగా ఉంటూ అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా షుగర్ వచ్చిందంటే ఒక భయం మొదలవుతుంది. ఏది తినాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచించి తినాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే డయాబెటిస్ బాధితులు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆహార నియంత్రణ వారి వ్యాధి తగ్గుదలకు చక్కటి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఎలాంటి డైట్ పాటించడం మంచిది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఏం తినకూడదు….

what-kind-of-diet-is-good-for-people-with-diabetes

అధిక ప్రోటీన్ కలిగిన జంతు మాంసం మరియు వెన్నవంటి అధికక కొవ్వు కలిగిన పాల ఉత్పత్తుల లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఘన కొవ్వుగా మారే ద్రావ నూనెలు.ఇవి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలలో ఉంటాయి. ఈ రెండు రకాల కొవ్వుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఉప్పు ని కూడా వీలైనంత తక్కువగా తీసుకోవాలి.ఇది అధిక రక్తపోటును నివారించేందుకు సహాయపడుతుంది.

ఏం తినాలి…

what-kind-of-diet-is-good-for-people-with-diabetes

డయాబెటి సమస్యతో బాధపడేవారు ఫైబర్ పుష్కలంగా ఉన్న పండ్లు ,కూరగాయలు, గింజలు ,బీన్స్ , తృణధాన్యాలు వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక బ్రేక్ ఫాస్ట్ విషయానికి వస్తే ,ఉప్మా, బోండా ,వడా ,పూరి వంటి ఆహారాలను దూరంగా ఉంచాలి. వీటికి బదులుగా ఓట్స్ ,క్విన్ వా దలియా వంటి వాటిని తీసుకోవాలి. మరి ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువ కలిగిన ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇక మధ్యాహ్న భోజనంలో అన్నం తక్కువగా కూర ఎక్కువగా తినాలి. అలాగే ప్రతిరోజు ఆకుకూరలను తీసుకుంటూ అప్పుడప్పుడు దుంప కూరలు కూడా అలవాటు చేసుకోవాలి.

ఇక సాయంత్రం చాలామందికి టీ కాఫీలతో బిస్కెట్లు తినడం అలవాటు. అయితే డయాబెటిస్ సమస్య కలిగిన వారు వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బిస్కెట్లు, బ్రెడ్ తీసుకోవటం మంచిది కాదు. ఇక రాత్రివేళ భోజనం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుత కాలంలో చాలామంది దాదాపు 10 తర్వాత తింటున్నారు. అయితే షుగర్ ఉన్న వాళ్ళు 8 నుండి 8:30 మధ్యలో ఆహారం తీసుకోవడం ఉత్తమం. దీని వలన షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఇలా క్రమం తప్పకుండా మూడు పూటలా సరైన సమయానికి తింటూ , కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేస్తూషుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అనుకునేవారు వీటిని అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.