Water Heater Precautions : వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారా…తస్మాత్ జాగ్రత్త..

Water Heater Precautions  : శీతాకాలం వచ్చిందంటే చాలు చన్నీటి స్నానం చేయాలంటే గజగజ వనకాల్సిందే. అందుకే చాలామంది శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే మన పెద్దలు కట్టెల పొయ్యి మీద నీటిని వేడి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడం వలన కట్టెల పొయ్యి కనుమరుగైపోయాయి. ఇక గ్యాస్ పైన నీటిని వేడి చేసుకుందామంటే బండ త్వరగా ఖాళీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది […]

  • Published On:
Water Heater Precautions : వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారా…తస్మాత్ జాగ్రత్త..

Water Heater Precautions  : శీతాకాలం వచ్చిందంటే చాలు చన్నీటి స్నానం చేయాలంటే గజగజ వనకాల్సిందే. అందుకే చాలామంది శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే మన పెద్దలు కట్టెల పొయ్యి మీద నీటిని వేడి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడం వలన కట్టెల పొయ్యి కనుమరుగైపోయాయి. ఇక గ్యాస్ పైన నీటిని వేడి చేసుకుందామంటే బండ త్వరగా ఖాళీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది నీటిని వేడి చేసేందుకు వాటర్ హీటర్లను వినియోగిస్తున్నారు. ఇక ఈ వాటర్ హీటర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉండటం వలన చాలామంది వీటిని కొనుగోలు చేసుకుని ఉపయోగిస్తున్నారు. అయితే వాటర్ హీటర్లను ఉపయోగించే సమయంలో నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. మరి వాటర్ హీటర్లను ఉపయోగించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

water-heater-precautions

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

  • వాటర్ హీటర్లను పెట్టే ప్లగ్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకుంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
  • అలాగే చిన్న పిల్లలు ఆడుకునే ప్రదేశాలలో వాటర్ హీటర్లను ఉపయోగించకూడదు. ఒకవేళ వినియోగించిన దానిని ఆఫ్ చేసే వరకు పిల్లల్ని కంట కానిపెడుతూ ఉండాలి.
  • అలాగే వాటర్ హీటర్లను బాత్రూంలో ఎక్కువగా వినియోగించకూడదు. ఎందుకంటే బాత్రూంలో ఎక్కువ తడి ఉంటుంది కాబట్టి షాక్ కొట్టే ప్రమాదాలు కూడా ఎక్కువే.
  • అలాగే వాటర్ హీటర్ యొక్క ఇమ్మర్షన్ రాడ్ పూర్తిగా మునిగిన తర్వాతే స్విచ్ ఆన్ చేసుకోవాలి
  • అలాగే స్విచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు నీటిని పట్టుకోకూడదు. పూర్తిగా ఆన్ ప్లగ్ చేసిన తర్వాతనే చేతితో చెక్ చేసుకోవాలి.
  • అలాగే నీటిని వేడి చేసుకోవడానికి ప్లాస్టిక్ బకెట్లను ఉపయోగించడం మంచిది. ఇనుము లేదా రాగి బకెట్లను ఉపయోగించడం వలన షాక్ కొట్టే ప్రమాదాలు అధికంగా ఉంటాయి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.