Zodiac Signs : అక్టోబర్ 19 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs : నేటి పంచాంగం: ➖➖➖✍️ 19 అక్టోబర్ 2022 దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయం : ఉ 06.01 / సా 05.44 సూర్య రాశి : తుల | చంద్ర రాశి : కర్కాటకం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తిథి : నవమి మ 02.13 ఆ తదుపరి దశమి వారం : ‌బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం : పుష్యమి ఉ08.02 ఆ తదుపరి […]

  • Published On:
Zodiac Signs : అక్టోబర్ 19 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs :

నేటి పంచాంగం:
➖➖➖✍️
19 అక్టోబర్ 2022
దృగ్గణిత పంచాంగం

సూర్యోదయాస్తమయం : ఉ 06.01 / సా 05.44
సూర్య రాశి : తుల | చంద్ర రాశి : కర్కాటకం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం
తిథి : నవమి మ 02.13 ఆ తదుపరి దశమి
వారం : ‌బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : పుష్యమి ఉ08.02 ఆ తదుపరి ఆశ్లేష
యోగం : సాధ్య సా 05.33 ఆ తదుపరి శుభ
కరణం : గరజి మ 02.13 వణిజ రా 03.12 ఆపైన భద్ర

శుభాశుభ సమయాలు
వర్జ్యం : రా 10.09 – 11.55
దుర్ముహూర్తం : ఉ 11.29 – 12.16
రాహు కాలం : మ 11.52 – 01.20
గుళిక కాలం : మ 10.24 – 11.52
యమ గండం : ఉ 07.28 – 08.56
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు

సాధారణ శుభ సమయాలు
👉 ఉ 07.00 – 10.00 మ 02.30 – 05.30 సా
అమృత కాలం : ఈరోజు లేదు
అభిజిత్ కాలం : ఈరోజు లేదు

వైదిక విషయాలు
ప్రాతఃకాలం : ఉ 06.00 – 08.21
సంగవకాలం : 08.21 – 10.42
మధ్యాహ్న కాలం : 10.42 – 01.03
అపరాహ్న కాలం : మ 01.03 – 03.23
సాయంకాలం : సా 03.23 – 05.44
ప్రదోష కాలం : సా 05.44 – 08.11
నిశీధ కాలం : రా 11.28 – 12.17
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.23 – 05.12

(19-10-2022) బుధవారం రాశి ఫలితాలు

మేషం: వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు. కొన్ని పనులలో శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు.

మిధునం: విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

కర్కాటకం: వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహం: నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభ సాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

కన్య: సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి,వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.

తుల: స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: బంధువులతో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనస్సు: సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో ఇతరలతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

మకరం: ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభం: సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

మీనం: ఇంటాబయట కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

Must Read: Hair Growth Tips: జుట్టు బాగా పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇలా చెయ్యండి..