Zodiac Signs : అక్టోబర్ 15 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs : నేటి పంచాంగం: ➖➖➖✍️ 15 అక్టోబర్ 2022 దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయం : ఉ 06.00 / సా 05.46 సూర్య రాశి : కన్య | చంద్ర రాశి : వృషభం/మిధునం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తిథి : షష్ఠి పూర్తిగా రాత్రంతా కూడా వారం : ‌శనివారం (స్ధిరవాసరే) నక్షత్రం : మృగశిర రా 11.22 ఆ తదుపరి ఆరుద్ర […]

  • Published On:
Zodiac Signs : అక్టోబర్ 15 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs :

నేటి పంచాంగం:
➖➖➖✍️
15 అక్టోబర్ 2022
దృగ్గణిత పంచాంగం

సూర్యోదయాస్తమయం : ఉ 06.00 / సా 05.46
సూర్య రాశి : కన్య | చంద్ర రాశి : వృషభం/మిధునం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం
తిథి : షష్ఠి పూర్తిగా రాత్రంతా కూడా
వారం : ‌శనివారం (స్ధిరవాసరే)
నక్షత్రం : మృగశిర రా 11.22 ఆ తదుపరి ఆరుద్ర
యోగం : వరీయాన్ మ 02.25 ఆ తదుపరి పరిఘ
కరణం : గరజి సా 05.55 వణిజ పూర్తిగా రాత్రంతా కూడా

సాధారణ శుభ సమయాలు
👉 ఉ 10.30 – 12.30 మ 02.30 – 05.30 సా
అమృత కాలం : మ 01.37 – 03.24
అభిజిత్ కాలం : ఉ 11.30 – 12.17

అశుభ సమయాలు
వర్జ్యం : ఈరోజు లేదు
దుర్ముహూర్తం : ఉ 06.00 – 07.34
రాహు కాలం : ఉ 08.56 – 10.25
గుళిక కాలం : ఉ 06.00 – 07.28
యమ గండం : మ 01.21 – 02.50
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు
ప్రాతఃకాలం : ఉ 06.00 – 08.21
సంగవకాలం : 08.21 – 10.42
మధ్యాహ్న కాలం : 10.42 – 01.04
అపరాహ్న కాలం : మ 01.04 – 03.25
ఆబ్ధీకం తిధి : ఆశ్వయుజ బహుళ షష్ఠి
సాయంకాలం : సా 03.25 – 05.46
ప్రదోష కాలం : సా 05.46 – 08.13
నిశీధ కాలం : రా 11.29 – 12.18
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.11

మేషం: వృత్తి వ్యాపారాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు.

వృషభం: వ్యాపారాలు విస్తరిస్తారు. దీర్ఘకాలిక రుణభారం కొంత వరకు తీరి ఊరట చెందుతారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. ఉద్యోగమున అధికారుల సహాయం అందుతుంది గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.

మిధునం: మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దూర ప్రయాణాల వలన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం: స్థిరస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుకు ప్రశంసలు పొందుతారు.

సింహం: చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ది పొందుతారు. సన్నిహితులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య: ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

తుల: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. నిరుద్యోగప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్ధిక పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

మకరం: స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు.

కుంభం: వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో మానసిక సమస్యలు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

మీనం: ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయిచేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

Must Read: Cold remedies:జలుబు మరియు ఫ్లూ నుండీ రక్షించుకోడానికి 7 చిట్కాలు !