Bhadrachalam : అంగరంగ వైభవంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం…ఆకాశాన్నంటిన సంబరాలు..

Bhadrachalam : భద్రాచలం లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల వారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరిగింది. సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని మిథుల స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈరోజు ఉదయమే సీతారాముల వారు కళ్యాణ మండపానికి చేరుకోగా ఉదయం 10:30కు కళ్యాణ మహోత్సవం ప్రారంభం అయింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల వారికి రుత్వికులు జిలకర బెల్లం పెట్టారు. ఆ తర్వాత సీతమ్మ మెడలో రామయ్య మాంగల్య ధారణ చేశారు. ఆ తర్వాత […]

  • Published On:
Bhadrachalam : అంగరంగ వైభవంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం…ఆకాశాన్నంటిన సంబరాలు..

Bhadrachalam : భద్రాచలం లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సీతారాముల వారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరిగింది. సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని మిథుల స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈరోజు ఉదయమే సీతారాముల వారు కళ్యాణ మండపానికి చేరుకోగా ఉదయం 10:30కు కళ్యాణ మహోత్సవం ప్రారంభం అయింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల వారికి రుత్వికులు జిలకర బెల్లం పెట్టారు. ఆ తర్వాత సీతమ్మ మెడలో రామయ్య మాంగల్య ధారణ చేశారు. ఆ తర్వాత తలంబ్రాల కార్యక్రమం జరగగా , అనంతరం జరిగే కార్యక్రమాలన్నింటినీ సాంప్రదాయపద్ధంగా అర్చకులు పూర్తి చేశారు.

sitarams-wedding-in-bhadradri-with-grand-splendor

sitarams-wedding-in-bhadradri-with-grand-splendor

ఈ వేడుకల లో స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది.  అయితే ప్రతిసారి కంటే ఈసారి శ్రీరామనవమి వేడుకలు భద్రాద్రిలో చాలా భిన్నంగా జరిగాయి. మిథుల స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాములు ఊరేగింపుగా వచ్చారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనం రాకతో రామనామ స్మరణ స్టేడియం అంత మార్మోగిందిసీత రాముల కళ్యాణ మహోత్సవానికి మిథుల స్టేడియాన్ని సర్వ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో నిండిపోయింది.

sitarams-wedding-in-bhadradri-with-grand-splendor

sitarams-wedding-in-bhadradri-with-grand-splendor

అలాగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి చిన్న జీయర్ స్వామి , ఎంపీలు రవిచంద్ర , కవిత , హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. అలాగే ఈ వేడుకల్లో భక్తుల సౌకర్యం కోసం మిథుల స్టేడియం లో 2.4 లక్షల చదరపు అడుగులు పందిళ్లను ఏర్పాటు చేశారు. అంతేకాక 35 ఎల్ఈడీ లను , 70 కూలర్లన, 250 ఫ్యాన్ లను, 32 సీసీ కెమెరాలు, 19 లడ్డు కౌంటర్లు, 50 టన్నుల ఏసి సౌకర్యంతో పాటు , తలంబ్రాలు పంపిణీ కోసం 70 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భక్తుల కోసం రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేసినట్లు దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఇక శుక్రవారం రోజున నిర్వహించనున్న శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకానికి గవర్నర్ తమిళ్ సై విచ్చేస్తున్నట్లుగా సమాచారం.