Bhogi : భోగి రోజున పిల్లల నెత్తిమీద రేగి పళ్ళు పోయడానికి కారణం ఏంటి ?

Bhogi: మన హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి సంక్రాంతి. సంక్రాంతి మూడు రోజులుగా జరుపుకుంటారు. సంక్రాంతి ముందు రోజు భోగిని, తర్వాతి రోజు కనుమ అని మూడు రోజులుగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే భోగి రోజున పిల్లల నెత్తిమీద రేగి పళ్ళు పోస్తే మంచిదని అంటారు. అయితే ప్రతి ఆచారం వెనక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. మన పూర్వీకులు ప్రతి ఆచారాన్ని దేవుడు అనే సృష్టికర్తకి ముడి పెట్టి మనుషుల్ని సరైన మార్గంలో […]

  • Published On:
Bhogi : భోగి రోజున పిల్లల నెత్తిమీద రేగి పళ్ళు పోయడానికి కారణం ఏంటి ?

Bhogi: మన హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి సంక్రాంతి. సంక్రాంతి మూడు రోజులుగా జరుపుకుంటారు. సంక్రాంతి ముందు రోజు భోగిని, తర్వాతి రోజు కనుమ అని మూడు రోజులుగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే భోగి రోజున పిల్లల నెత్తిమీద రేగి పళ్ళు పోస్తే మంచిదని అంటారు. అయితే ప్రతి ఆచారం వెనక ఒక శాస్త్రీయ కోణం ఉంటుంది. మన పూర్వీకులు ప్రతి ఆచారాన్ని దేవుడు అనే సృష్టికర్తకి ముడి పెట్టి మనుషుల్ని సరైన మార్గంలో నడిపించేవారు. అలాగే పిల్లల తల మీద భోగి పండ్లు పోస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటుందని చెబుతున్నారు. అయితే దీని వెనుక అసలు రహస్యం వేరే ఉంది.

ఈ రేగి పండు శ్రీమన్నారాయణని ప్రతిరూపం అని అంటారు. సూర్యుడికి ఇష్టమైన రేగి పండు చూడడానికి సూర్యుడిలా గుండ్రంగా అస్తమించే సమయంలో సూర్యుడు ఉండే రంగులో ఉంటాయి. వీటిని నాణాలతో కలిపి పిల్లల తల మీద పోస్తారు. ఇలా చేయడం వలన శ్రీమన్నారాయణనుని అనుగ్రహం కలుగుతుందని, అలాగే పిల్లలపై ఉన్న దిష్టి తొలగి శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుందని నమ్ముతారు. దీనికి మరొక కారణం.. మనకి బ్రహ్మ రంధ్రం తలపై ఉంటుంది. పిల్లలకి ఈ బ్రహ్మ రంధ్రం చాలా పలుచగా ఉంటుంది.

రేగి పండ్లను తలమీద పోసినప్పుడు రేగిపండ్ల నుంచి వచ్చే వాయువు నరాలకి తగిలి పిల్లలు యాక్టివ్ అవుతారు. రేగిపండ్లను పోయడం వలన పిల్లల బ్రహ్మ రంధ్ర బలంగా తయారవుతుంది. దీంతో వారి మేదస్సు పెరుగుతుంది. అలాగే పిల్లల చుట్టూ ఉండే నెగిటివ్ ఆరా తొలగిపోతుందని పిల్లలు చాలా యాక్టివ్గా తయారవుతారని చెబుతుంటారు. రేగి పండును బదరీఫలం అని కూడా పిలుస్తారు. నర నారాయణలు బదరికా వనంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం గోర తపస్సు చేసిన సమయంలో దేవతలు వారి శిరస్సుల మీద బదరీఫలములను కురిపించారని చెబుతారు. అందుకే పిల్లలను నారాయణుడిగా భావించి తలమీద రేగి పండ్లను వేసే సంప్రదాయం వచ్చిందని చెబుతారు.

Must Read : BREAKING Pawan kalyan : మూడో భార్యకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ..