Income Tax : ఈ అలవెన్స్ లు ఉంటే .. పన్ను కట్టాల్సిన పనిలేదు ..

Income Tax :  కార్మికుల ఆదాయం వ్యాపార లాభాలపై ప్రభుత్వం నిషేధించేది మరియు కొన్ని వస్తువులు సేవలు లావాదేవీల ఖర్చుపై వేసే పన్నునే రాష్ట్ర ఆదాయం. ప్రతి రాష్ట్రం ప్రజలపై పన్ను విధించి రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపు దారులు ప్రతి ఏటా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. 2023 24 కు ఈ సంవత్సరం జులై 31 కల్లా ఐటిఆర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే కొన్ని కంపెనీలు […]

  • Published On:
Income Tax : ఈ అలవెన్స్ లు ఉంటే .. పన్ను కట్టాల్సిన పనిలేదు ..

Income Tax :  కార్మికుల ఆదాయం వ్యాపార లాభాలపై ప్రభుత్వం నిషేధించేది మరియు కొన్ని వస్తువులు సేవలు లావాదేవీల ఖర్చుపై వేసే పన్నునే రాష్ట్ర ఆదాయం. ప్రతి రాష్ట్రం ప్రజలపై పన్ను విధించి రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపు దారులు ప్రతి ఏటా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం తప్పనిసరి. 2023 24 కు ఈ సంవత్సరం జులై 31 కల్లా ఐటిఆర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు పన్ను భారం తగ్గించేందుకు అలవెన్స్ లా రూపంలో పన్ను ప్రయోజనాలను అందిస్తుంటాయి. ఐటిఆర్ దాఖలు చేసే సమయంలో ఈ పన్ను అలవెన్స్ లు ఉపయోగించుకుంటే పెద్ద మొత్తంలో టాక్స్ ని ఆదా చేసుకోవచ్చు.

కంపెనీలు ఉద్యోగులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి ఇలాంటి సమయంలో రీలొకేషన్ అలవెన్స్ ను ఉపయోగించుకుంటే ఉద్యోగి సామాన్లను తరలించేందుకు అయిన ఖర్చు, కార్ల తరలింపు, రిజిస్ట్రేషన్ కు అయ్యే ఖర్చు రైళ్లు విమాన టిక్కెట్లు, ప్రాథమికంగా 15 రోజుల వసతికి అయ్యే ఖర్చును కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. అద్దె ఇళ్లల్లో నివాసం ఉండేవాళ్ళు హౌస్ రెంట్ అలవెన్స్ ఉపయోగించుకొని పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. మెట్రో నగరాల్లో జీవించేవారు తమ జీతంలో 50 శాతం పన్ను, నాన్ మెట్రో నగరాలలో జీవించేవారు తమ జీతంలో 40% పన్ను మినహాయింపులు పొందవచ్చు.

లీవ్ ట్రావెల్ కన్సేషన్ అలవెన్స్ కింద ఉద్యోగులు సెలవులలో ఏ దేశంలో పర్యటించిన ప్రయాణ ఖర్చుపై పన్ను పడదు. అయితే రైలు విమానాలు, ప్రజా రవాణా సాధనాల ద్వారా మాత్రమే ప్రయాణించాలి. అయితే నాలుగు సంవత్సరాల లో రెండుసార్లకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు ఉంటుంది. పిల్లల చదువుకు చేసే ఖర్చుకు సంబంధించిన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ తో కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు నెలకు 100 చొప్పున మినహాయింపు పొందవచ్చు. యూనిఫామ్ అలవెన్స్ కింద విధి నిర్వహణలో ధరించే యూనిఫామ్ కొనుగోలు నిర్వహణ కోసం చేసే ఖర్చు పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే పుస్తకాలు, న్యూస్ పేపర్లు, పిరియాడికల్ లాంటివి కొనుగోలు చేసి దానికి సంబంధించి రియంబర్స్మెంట్ పొందితే పన్ను కట్టాల్సిన పనిలేదు.

Must Read : Work from home : ఎంచక్కా ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ ఇదే .. వేలల్లో ఆదాయం ..