Sports News : నిజాయితీ లేని ఓ ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించిన క్రీడా సంస్థ ..

Sports News : ప్రతి క్రీడాకారుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. మనస్ఫూర్తి గనుక ఆటగాడిలో లేకపోతే అతని జీవితం వివాదంలో చిక్కుకున్నట్లే. అలా ఎంతోమంది ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రీడలో నుంచి ఎంతోమంది నిషేధించబడ్డారు. తాజాగా ఓ మాజీ ఆటగాడుడు ఏకంగా 135 మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు రుజువు కావడంతో అతడిపై జీవిత కాల నిషేధం విధించారు. టెన్నిస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ సమస్య కొనసాగుతున్న సమస్య. 2003లో ది సండే […]

  • Published On:
Sports News : నిజాయితీ లేని ఓ ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించిన క్రీడా సంస్థ ..

Sports News : ప్రతి క్రీడాకారుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం క్రీడా స్ఫూర్తి. మనస్ఫూర్తి గనుక ఆటగాడిలో లేకపోతే అతని జీవితం వివాదంలో చిక్కుకున్నట్లే. అలా ఎంతోమంది ఆటగాళ్లు ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రీడలో నుంచి ఎంతోమంది నిషేధించబడ్డారు. తాజాగా ఓ మాజీ ఆటగాడుడు ఏకంగా 135 మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు రుజువు కావడంతో అతడిపై జీవిత కాల నిషేధం విధించారు. టెన్నిస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ సమస్య కొనసాగుతున్న సమస్య. 2003లో ది సండే టెలిగ్రాఫ్ మొదటిసారిగా నివేదించింది.

ఈ సమస్యపై పరిశోధన తర్వాత 2008లో టెన్నిస్ ఇంటిగ్రిటీ యూనిట్ అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. 2011లో, డేనియల్ కొల్లరర్ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా క్రీడ నుండి జీవితకాల నిషేధం పొందిన మొదటి ఆటగాడు అయ్యాడు. ఆటగాడిగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించడమన్నది ఓ గౌరవం. అలాంటి గొప్ప అవకాశాన్ని ఏ ఆటగాడు కూడా వదులుకోడు. అయితే కొందరు ప్లేయర్స్ మాత్రం డబ్బుకు ఆశ పడి దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు.

తాజాగా మెురాకోకు చెందిన మాజీ టెన్నిస్ ఆటగాడు ఆ పనే చేశాడు. దీంతో అతడికి అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రీటీ ఏజెన్సీ షాక్ ఇచ్చింది. మెురాకో టెన్నిస్ ఆటగాడు అయిన యూనెస్ రచిడి 135 మ్యాచ్ ల్లో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు రుజువు అయింది. దీంతో టెన్నిస్ సంస్థ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. అల్జీరియన్ ఆటగాళ్లతో రచిడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దాంతో అతడిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Must Read :Sri Reddy : ” ఒరేయ్ పీకే .. ముసలి ము*డా కొడకా .. నీకు భయం ఏంట్రా ” పచ్చి బూతులతో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి ..