Youtube : యూట్యూబర్స్ కి గుడ్ న్యూస్ .. ఇలా చేశారంటే డబ్బులే డబ్బులు ..

Youtube: ప్రస్తుతం చాలామంది కాస్త కాళీ సమయం దొరికిందంటే చాలు ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వివిధ రకాల వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చాలా మంది వివిధ రకాల వీడియోలను క్రియేట్ చేసి వేలల్లో, లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు.

  • Published On:
Youtube : యూట్యూబర్స్ కి గుడ్ న్యూస్ .. ఇలా చేశారంటే డబ్బులే డబ్బులు ..

Youtube: ప్రస్తుతం చాలామంది కాస్త కాళీ సమయం దొరికిందంటే చాలు ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వివిధ రకాల వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే చాలా మంది వివిధ రకాల వీడియోలను క్రియేట్ చేసి వేలల్లో, లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు. అయితే తాజాగా గూగుల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. షార్ట్ మానిటైజేషన్ మాడ్యూల్ తో సహా కొత్త మాడ్యూల్ ను చేర్చడానికి యూట్యూబ్ పార్ట్ నర్ ప్రోగ్రాం నిబంధనలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది.

యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు ప్రకటనల ద్వారా చిన్న చిత్రాలతో డబ్బు సంపాదించే అవకాశాన్ని అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. క్రియేటర్లు ఈ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ ప్రకటనలను ఎంపిక చేసుకోవచ్చు.అంతే కాకుండా యుట్యూబ్ లోకి వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్, కామర్స్ ప్రోడక్ట్ అడెండమ్, ఇతర సంపాదన అవకాశాలను కూడా తీసుకొచ్చారు. దీంతో వ్యూస్ పేజీలో చూసిన లైవ్ వీడియోలను మానిటైజ్ చేయవచ్చు.ఈ కొత్త మాడ్యూల్స్ నుంచి లాభాలను పొందాలంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా అప్‌డేట్ చేయబడిన నియమాలను అనుసరించాలి.

షార్ట్స్ మానిటిజేషన్ మాడ్యూల్ షార్ట్స్ మధ్య వచ్చే ప్రకటనలను చూస్తే మీ ఛానల్ ను అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది. కస్టమర్స్ ఇప్పటికే కామర్స్ ప్రోడక్ట్ అడెండమ్ నీ ఆమోదించినట్లయితే, వారు దాని నిబంధనలను మళ్లీ ఆమోదించాల్సిన అవసరం లేదు. వినియోగదారులు కొత్త వైపిపి నిబంధనలను చూసి అర్థం చేసుకోవాలి. YPP లో చేరడానికి లేదా కొనసాగడానికి ప్రాథమిక నిబంధనలను తప్పకుండా అంగీకరించాలి. ఆ తారీకు లోపు నిబంధనలను ఒకే చేయకపోతే YPP నుంచి మీ ఛానల్ నీ తొలగించబడుతుంది.

Must Read: Actress sudha: ” కడుపు నింపుకోవడం కోసం తాళిబొట్టు అమ్ముకున్నా ” నటి సుధ ఎమోషనల్ కామెంట్స్ ..