Self Charge Bikes : కరెంట్ పెట్రోల్ అవసరం లేని సరికొత్త బైక్ .. ధర కూడా చాలా చీప్ ..

Self Charge Bikes : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు దిగుతున్నాయి. అందులోనూ ప్రజలను ఆకర్షించేలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ బైకుల ధర కొంచెం ఎక్కువే. సామాన్య ప్రజలు కొనలేరు. అదే పెట్రోల్ పోయాల్సిన పని లేకుండా, […]

  • Published On:
Self Charge Bikes : కరెంట్ పెట్రోల్ అవసరం లేని సరికొత్త బైక్ .. ధర కూడా చాలా చీప్ ..

Self Charge Bikes : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు దిగుతున్నాయి. అందులోనూ ప్రజలను ఆకర్షించేలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు. అదిరిపోయే ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ బైకుల ధర కొంచెం ఎక్కువే. సామాన్య ప్రజలు కొనలేరు. అదే పెట్రోల్ పోయాల్సిన పని లేకుండా, చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండా బైక్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఈ క్రమంలో అలాంటి బైక్ నే ఓ యువకుడు సృష్టించాడు .

నంద్యాల జిల్లా చెందిన బాజాన్ అనే వ్యక్తి సరికొత్త బైక్ ను సృష్టించాడు. ఇతను అంతగా చదువుకోలేదు. 9వ తరగతి వరకే చదువుకొని ఆ తర్వాత తన ఊర్లోనే చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. ఆ తరువాత వాహనాల బ్యాటరీ మెకానిక్గా పట్టు సాధించాడు. ఈ పని ఆయనకు అంతగా నచ్చలేదు. కుటుంబ పోషణ కోసం ఈ పనిని చేస్తూ ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. మొదట బ్యాటరీతో నడిచే మోటార్ సైకిల్ ను తయారుచేసి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ బైక్ చార్జింగ్ ఉన్నంతవరకే వెళుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. దీంతో దీనికి పరిష్కారం ఎలా అని ఆలోచించసాగాడు.

అప్పుడే కరెంటు పెట్రోల్ అవసరం లేకుండా బైక్ను తయారు చేయాలని ఆలోచన వచ్చింది. అందుకు రెండు డ్రై బ్యాటరీలు తీసుకొని ఎక్సెల్ వాహనానికి బిగించాడు. బైక్ నడిచేటప్పుడు బ్యాటరీలు వాటి అంతటవే రీచార్జ్ అయ్యేలా చేశాడు. ఇంజిన్‌కు బదులుగా ఒక హబ్‌ ను ఏర్పాటు చేశాడు. దీంతో వాహనాన్ని ముందుకు వెళ్లేలా ఏర్పాటు చేశాడు. దీంతో బైక్ బ్యాటరీ దానంతట అదే రీఛార్జ్ అవుతుంది. ఇది 50కి.మీ వేగంతో వెళుతుంది. బ్యాటరీ కి 13 వేలు, హబ్ కు 35 వేలు, ఛార్జింగ్ మోటార్ కు 12వేలు ఖర్చు అయ్యాయని బాజా తెలిపాడు.

Must Read:Bhogi : భోగి రోజున పిల్లల నెత్తిమీద రేగి పళ్ళు పోయడానికి కారణం ఏంటి ?