Lakshmi Devi Kataksham : ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే…జాగ్రత్త…

Lakshmi Devi Kataksham  : ప్రతి ఒక్కరు వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం అందుకు వ్యతిరేకమని చెప్పాలి. ఆమెని ఆలక్ష్మీ గా పిలుస్తుంటారు. ఇక ఆ లక్ష్మి మాతకు కారం మరియు పుల్లని పదార్థాలు అంటే మక్కువ ఎక్కువ.అందుకే మన ఇంటి ముందు నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఇంట్లోకి రాకుండా బయటనే ఆగిపోవాలని. ఆ లక్ష్మీ ఇంట్లోకి ప్రవేశిస్తే పేదరికం వస్తుందని పండితులు […]

  • Published On:
Lakshmi Devi Kataksham : ఈ లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే…జాగ్రత్త…

Lakshmi Devi Kataksham  : ప్రతి ఒక్కరు వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం అందుకు వ్యతిరేకమని చెప్పాలి. ఆమెని ఆలక్ష్మీ గా పిలుస్తుంటారు. ఇక ఆ లక్ష్మి మాతకు కారం మరియు పుల్లని పదార్థాలు అంటే మక్కువ ఎక్కువ.అందుకే మన ఇంటి ముందు నిమ్మకాయలు మరియు మిరపకాయలను వేలాడదీస్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఇంట్లోకి రాకుండా బయటనే ఆగిపోవాలని. ఆ లక్ష్మీ ఇంట్లోకి ప్రవేశిస్తే పేదరికం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఇక ఈ సమయంలో లక్ష్మీదేవిని ఎంతగా ప్రార్ధించినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే ఆలక్ష్మీ ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. వీరిద్దరూ అక్క చెల్లెలు అయినప్పటికీ ఒకేచోట అసలు కలిసి ఉండలేరని శాస్త్రం చెబుతుంది. ఈ నేపథ్యంలో దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

if-you-see-these-symptoms-its-like-you-have-a-poor-goddess-in-your-house-be-careful

అయితే దరిద్ర దేవత కొలువై ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడు నీరసంగా ఉత్సాహం లేకుండా ఉంటారు. అలాగే ఆలక్ష్మీ ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ ఇంట్లో పెద్దల మాట పిల్లలు అసలు వినరు. తల్లిదండ్రులను గౌరవించకుండా ఇష్టాను సారం వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉండే ఆడవాళ్లు ప్రతిదానికి ఏడవడం, గొడవలు పడడం ,గట్టిగా అరవడం చిన్న చిన్న విషయాలకు ,రాద్ధాంతం చేయడం చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇవన్నీ దరిద్ర దేవత ఇంట్లో ఉన్నప్పుడు జరుగుతుంటాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ఇల్లు ఎంత శుభ్రం చేసిన దుర్వాసన వస్తూ ఉంటుంది తెలియజేస్తున్నారు.

if-you-see-these-symptoms-its-like-you-have-a-poor-goddess-in-your-house-be-careful

ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు వెంటనే ఆలక్ష్మిని బయటకు పంపించాలని దానికోసం కొన్ని చిట్కాలను పాటించాల్సిందిగా తెలియజేస్తున్నారు. మీ ఇంట్లో ఇలాంటి సూచనలు కనపడినట్లయితే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు తీసుకొని నీటిలో కలిపి ఆ పసుపు నీటిని గదిలో చల్లితే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ధూపాలు వేయడం ,అగరవత్తులు వెలిగించడం వంటివి చేయడం ద్వారా దరిద్ర దేవత ఇంట్లో ఉండదు. అలాగే ఈ దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కొన్నిసూచనలు పాటించాలి. అవేంటంటే చీకటి పడిన తర్వాత బట్టలు ఉతకూడదు… ఇంట్లో ఊడ్చే చీపుర్లను నిలబెట్టకూడదు… సాయంత్రం సమయంలో నిద్రించకూడదు…ఈ సూచనలు పాటించినట్లయితే మీ ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండడం ,అగరవత్తులు సుగంధ ద్రవ్యాలతో ఇల్లు కళకళలాడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది.

గమనిక: పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.