Black Diamond Apple : ఈ అరుదైన ఆపిల్ తినాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే…ధర ఎంతో తెలుసా..?

Black Diamond Apple : మనం మార్కెట్లో అనేక రకాల ఆపిల్ పండ్లను చూస్తూనే ఉంటాం కానీ బ్లాక్ డైమండ్ ఆపిల్ మాత్రం ఇంతవరకు చూసి ఉండం. ఎందుకంటే మన మార్కెట్ లో ఇవి అందుబాటులో ఉండవు కూడా. ఇక ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్ అనేది అరుదైన పండ్లలో ఒకటిగా పిలుస్తారు. మన భారతదేశంలో దాదాపు ఈ ఆపిల్ కనిపించదు. ఆన్లైన్లో బుక్ చేయడానికి కూడా ఈ ఆపిల్ కనిపించదు. ఇక ఈ ఆపిల్ కావాలంటే […]

  • Published On:
Black Diamond Apple : ఈ అరుదైన ఆపిల్ తినాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే…ధర ఎంతో తెలుసా..?

Black Diamond Apple : మనం మార్కెట్లో అనేక రకాల ఆపిల్ పండ్లను చూస్తూనే ఉంటాం కానీ బ్లాక్ డైమండ్ ఆపిల్ మాత్రం ఇంతవరకు చూసి ఉండం. ఎందుకంటే మన మార్కెట్ లో ఇవి అందుబాటులో ఉండవు కూడా. ఇక ఈ బ్లాక్ డైమండ్ ఆపిల్ అనేది అరుదైన పండ్లలో ఒకటిగా పిలుస్తారు. మన భారతదేశంలో దాదాపు ఈ ఆపిల్ కనిపించదు. ఆన్లైన్లో బుక్ చేయడానికి కూడా ఈ ఆపిల్ కనిపించదు. ఇక ఈ ఆపిల్ కావాలంటే టీబెట్ ప్రాంతానికి వెళ్లాల్సిందే. టిబెట్ లోని నింగ్ చీ అనే పర్వత ప్రాంతాలలో ఈ యాపిల్స్ కనిపిస్తాయి. కేవలం ఆ ప్రదేశంలో మాత్రమే ఇవి పండుతాయి. ఇక దీని పైభాగం మొత్తం నల్లగా ఉన్నప్పటికీ లోపల మాత్రం తెల్లగా ఉంటుంది.

if-you-want-to-eat-this-rare-apple-you-have-to-sell-your-property-do-you-know-the-price

ఇతర ఆఫీల్స్ మాదిరిగా కాకుండా ఇది కాస్త తీపి కాస్త పులుపు తో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఇక ఈ పండ్ల ధర విషయానికొస్తే ఒక కేజీ దాదాపు 3 వేలు దాకా ఉంటుందట.. అంటే ఒక్కో యాపిల్ ధర దాదాపు 500 రూపాయల వరకు ఉంటుందట. వీటిని టిబెట్ ప్రాంతం నుండి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. వీటి దిగుబడి చాలా తక్కువ ఉండటం , అలాగే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన వీటి ధర ఇలా ఉంది. అంతేకాదు ఈ బ్లాక్ ఆపిల్స్ సాగు చేయడం కూడా చాలా కష్టమట.

if-you-want-to-eat-this-rare-apple-you-have-to-sell-your-property-do-you-know-the-price

సాధారణ పండ్ల చెట్లు అయితే నాటిన 3 సంవత్సరాల లోపు పండ్లు కాస్తాయి కానీ ఈ బ్లాక్ ఆపిల్ మాత్రం నాటిన 8 ఏళ్ళ తర్వాతనే కాస్తాయట. అందుకే ఏళ్ల తరబడి దీని దిగుబడి కోసం ఎదురుచూపులు తప్పవు. ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో దిగుబడి వస్తుంది. ఆ సమయంలో ఈ ఆపిల్ పండును సేకరించటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆ సమయంలో పర్వతాలపై వాతావరణం అనుకూలంగా ఉండదు. ఇంతటి కష్టాలను ఎదుర్కొన్న తర్వాత ఈ ఆపిల్స్ మార్కెట్లోకి వస్తాయి కాబట్టి వీటి ధర చాలా ఎక్కువ. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆపిల్స్ తిని ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.