Hyderabad Metro Recruitment : నిరుద్యోగులకు శుభవార్త… హైదరాబాద్ మెట్రో నోటిఫికేషన్ విడుదల…రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం…
Hyderabad Metro Recruitment : నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో సంస్థ శుభవార్తను తీసుకువచ్చింది . హైదరాబాద్ మెట్రో లో 9 రకాల పోస్ట్ ల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 46 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగ భర్తీకి ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. అభ్యర్థి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి…? లాంటి వివరాలను ఇప్పుడు […]
Hyderabad Metro Recruitment : నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో సంస్థ శుభవార్తను తీసుకువచ్చింది . హైదరాబాద్ మెట్రో లో 9 రకాల పోస్ట్ ల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 46 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగ భర్తీకి ఎలాంటి రాత పరీక్షలు ఉండవు. అభ్యర్థి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి…? లాంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు : 46
* సిగ్నలింగ్ టీం లీడర్ పోస్ట్ ఖాళీలు – 3
* రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్ పోస్ట్ ఖాళీలు – 1
* రోలింగ్ స్టాక్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీలు – 1
* AFC/COM మెయింటెయినర్ పోస్ట్ ఖాళీలు – 5
* రైలు ఆపరేటర్ పోస్ట్ ఖాళీలు – 30
* AFC/COM సిస్టమ్ అనలిస్ట్ పోస్ట్ ఖాళీలు – 1
* PSS ఇంజనీర్ పోస్ట్ ఖాళీలు – 1
* PSS టీమ్ లీడర్ పోస్ట్ ఖాళీలు – 2
* MEP టీమ్ లీడర్ పోస్ట్ ఖాళీలు – 2
విద్యార్హతలు…
ఈ పోస్టును భర్తీ చేసేందుకు డిప్లొమా ,ఐటిఐ ,బీఈ, బీటెక్ ,ఎంబీఏ ఎంసీఏ ,ఎంఎస్సీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థికి సంబంధిత పనులలో అనుభవం ( experience certificate) కలిగి ఉండాలి.
వయస్సు…
అభ్యర్థి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయసు సడలింపు వంటి ప్రయోజనాలు వర్తిస్తాయి.
దరఖాస్తు చేసుకునే విధానం….
అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా https://www.ltmetro.com/ లోకి వెళ్లాల్సి ఉంటుంది. Current opportunities అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి దానిని KeolisHyd.Jobs@keolishyderabad.com కు పంపాలి.
ఎంపిక విధానం..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. దానిలో క్వాలిఫై అయిన వారికి స్కిల్స్ టెస్ట్ పెట్టి వారి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం .. …ఇక్కడ క్లిక్ చేయండి.