Eyesight : కళ్లద్దాలతో ఇబ్బంది పడుతున్నారా…అయితే ఇలా చేయండి శాశ్వతంగా మీ కళ్ళద్దాలు దూరం అవుతాయి….

Eyesight  : ప్రస్తుతం వాతావరణంలో మారిన పరిస్థితుల వలన చిన్న పిల్లల సైతం కళ్లద్దాలను ధరిస్తున్నారు. ఇక దీనికి గల ప్రధాన కారణం ఎక్కువసేపు టీవీలు మొబైల్స్ చూడడం అని చెప్పాలి. తద్వారా కంటిచూపు మందగించి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కళ్లద్దాలను ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఒక్కసారి కళ్లద్దాలను ధరించినట్లయితే జీవితకాలం వాటిని వినియోగిస్తూనే ఉంటారు. అయితే మీ కళ్లద్దాలను శాశ్వతంగా వదిలించుకోవడానికి మీకోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము. ఇక వీటిని అనుసరించటం […]

  • Published On:
Eyesight : కళ్లద్దాలతో ఇబ్బంది పడుతున్నారా…అయితే ఇలా చేయండి శాశ్వతంగా మీ కళ్ళద్దాలు దూరం అవుతాయి….

Eyesight  : ప్రస్తుతం వాతావరణంలో మారిన పరిస్థితుల వలన చిన్న పిల్లల సైతం కళ్లద్దాలను ధరిస్తున్నారు. ఇక దీనికి గల ప్రధాన కారణం ఎక్కువసేపు టీవీలు మొబైల్స్ చూడడం అని చెప్పాలి. తద్వారా కంటిచూపు మందగించి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కళ్లద్దాలను ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఒక్కసారి కళ్లద్దాలను ధరించినట్లయితే జీవితకాలం వాటిని వినియోగిస్తూనే ఉంటారు. అయితే మీ కళ్లద్దాలను శాశ్వతంగా వదిలించుకోవడానికి మీకోసం కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము. ఇక వీటిని అనుసరించటం వలన శాశ్వతంగా మీ కళ్లద్దాలను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ చిట్కాను ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఆచరించవచ్చు. కానీ ఈ చిట్కాను ప్రతిరోజు అనుసరించాల్సి ఉంటుంది. కనీసం 20 రోజులు పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటించినట్లయితే కళ్లద్దాలు లేకుండానే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు.

ways-to-increase-eyesight-naturally

అయితే ఈ ప్రక్రియను చేసే సమయంలో కళ్ళద్దాలను పక్కన పెట్టాలి. మొదటిగా కళ్ళను పదిసార్లు పైకి కిందకి కదిలిస్తూ ఉండాలి.ఈ క్రమంలో కళ్ళను వీలైనంత కిందకి పైకి కదిలించాలి. అనంతరం కళ్ళను వ్యతిరేక దిశలో తిప్పుతూ కొన్ని రోజులపాటు ఈ ఎక్ససైజ్ ను పాటించాలి. ప్రతిరోజు ఇలా చేయడం వలన కొన్ని రోజుల్లోనే మీ దృష్టి సరి అవుతుంది. అలాగే మీ ముక్కు దగ్గర కళ్లకు మధ్యలో బొటన వేలు ఉంచి నెమ్మదిగా దృష్టిని కోల్పోకుండా చేతిని బొటనవేలును దూరంగా కదిలించాలి. ఇక ఆ సమయంలో మీ దృష్టిని బొటనవేలు కొనపై ఉంచాలి. అనంతరం మరల బొటనవేలను ముక్కు వైపుకు తీసుకురావాలి. ఈ విధంగా రోజులో పదిసార్లు చేస్తే కళ్ల దిష్టి సరి అవుతుంది. అలాగే కీర దోసకాయలను ముక్కలుగా కట్ చేసి 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.

ways-to-increase-eyesight-naturally

ఇలా చేయడం వలన ఉష్ణోగ్రత తగ్గి కళ్ళు చుట్టుపక్కల మొత్తం చల్లగా ఉంటుంది. అయితే ఈ కీరా దోసకాయ కళ్ళను క్లీన్ చేయడమే కాక బాడీ ని కూడా చాలా రిలాక్స్డ్ గా చేస్తుంది. అలాగే ప్రస్తుతం చాలామంది కంప్యూటర్స్ లాప్టాప్స్ ముందు ఎక్కువ సేపు సమయాన్ని గడుపుతున్నారు. ఇలా చేసేవారు ప్రతి అరగంటకు ఒకసారి విశ్రాంతి తీసుకుని ఒక 20 సెకండ్ల పాటు కళ్ళని అటు ఇటు తిప్పుతూ మూసి తెరవాలి. ఇలా చేయడం వలన మీ కళ్ళు కాస్త రిలాక్స్డ్ గా ఫీల్ అవుతాయి. అలాగే మన పూర్వీకులు అనుసరించే విధానం కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఒక చీకటి గదిలో కొవ్వొత్తి లేదా దీపం వెలిగించి వీలైనంతవరకు కొవ్వొత్తినే చూస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన కంటిలో నుండి నీరు రావడం మొదలవుతుంది. తద్వారా మీ కళ్ళు శుభ్రం అవుతాయి. ఇక ఈ చిట్కాలను మీరు అనుసరించినట్లయితే అనతి కాలంలోనే మంచి ఫలితాలను పొందుతారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.