Snake Bite : పాము కాటుకు గురైనప్పుడు మొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా…

Snake Bite : చాలామందికి పాములు అంటే విపరీతమైన భయం ఉంటుంది. మరి కొందరైతే వాటి గురించి మాట్లాడిన వనికి పోతారు. ఇక పాము కళ్ళ ఎదురుగా కనిపిస్తే పరుగులు తీయడం ఖాయం. అదే పాము కాటుకు గురైతే ఏం చేయాలో అర్థం కాక విపరీతంగా భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరి ముఖ్యంగా గ్రామాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గ్రామాల్లో నివసించేవారు పంట పొలాల్లో , గుట్టలలో, కొండలలో తిరగటం వలన ఇలాంటివి […]

  • Published On:
Snake Bite : పాము కాటుకు గురైనప్పుడు మొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా…

Snake Bite : చాలామందికి పాములు అంటే విపరీతమైన భయం ఉంటుంది. మరి కొందరైతే వాటి గురించి మాట్లాడిన వనికి పోతారు. ఇక పాము కళ్ళ ఎదురుగా కనిపిస్తే పరుగులు తీయడం ఖాయం. అదే పాము కాటుకు గురైతే ఏం చేయాలో అర్థం కాక విపరీతంగా భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. మరి ముఖ్యంగా గ్రామాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గ్రామాల్లో నివసించేవారు పంట పొలాల్లో , గుట్టలలో, కొండలలో తిరగటం వలన ఇలాంటివి జరిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పాముకాటుకు గురైనప్పుడు ఎలాంటి భయం లేకుండా ఈ చిట్కాలను పాటించడం వలన ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

do-you-know-the-first-thing-to-do-when-bitten-by-a-snake

 

  • బహిరంగ ప్రదేశాలలో ఎక్కడైనా పాము కరిచినప్పుడు భయంతో సమయాన్ని వృధా చేస్తుంటారు. ఈ క్రమంలో శరీరమంతా విషం పాకుతుంది. తద్వారా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో కాటేసింది విష సర్పం కాకపోయినా విపరీతమైన భయం కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు. కాబట్టి పాముకాటుకు గురైనప్పుడు ముందుగా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్నప్పుడే మన శరీరంలో విషం ప్రభావం కూడా చాలా తక్కువ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశం ఇది.
  • ఇక పాముకాటు వేసిన చోట శరీరమంతా విషం పాకకుండా ఉండేందుకు గుడ్డతో గాని తాడుతో కానీ గట్టిగా కట్టాలి. అలా 15 నిమిషాలకు ఒకసారి వదులు చేస్తూ మళ్ళీ కట్టుకోవాలి.
  • అలాగే పాము కాటు వేసిన ప్రదేశంలో సబ్బు నీరు లేదా యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేయాలి. అలాగే సాధ్యమైనంతవరకు శరీరాన్ని కదిలించకుండా ఉండాలి.
  • మరి ముఖ్యంగా పాము కాటుకు గురైనప్పుడు నడవటం పరిగెత్తడం వంటివి అసలు చేయకూడదు. ఇలా చేయడం వలన విషయం శరీర భాగాల్లోకి త్వరగా వ్యాపించి ప్రాణాలు మీదకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అలాగే సినిమాల ప్రభావం కారణంగా చాలామంది పాముకాటు వేసిన భాగం నుంచి నోటితో రక్తాన్ని పీలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా చేయకూడదు.
  • పాము కాటుకు గురైన వ్యక్తిని సాధ్యమైనంత త్వరగా వైద్యుని వద్దకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయాలి. సొంత వైద్యం ప్రాణాలకే ప్రమాదం. మరి ముఖ్యంగా మంత్రాలు నాటు వైద్యం అంటూ మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికి సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.