Zodiac Signs : అక్టోబర్ 21 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs : నేటి పంచాంగం: 21 అక్టోబర్ 2022 దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయం : ఉ 06.01 / సా 05.43 సూర్య రాశి : తుల | చంద్ర రాశి : సింహం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తిథి : ఏకాదశి సా 05.22 ఆ తదుపరి ద్వాదశి వారం : ‌శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం : మఖ మ 12.28 ఆ తదుపరి […]

  • Published On:
Zodiac Signs : అక్టోబర్ 21 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs :

నేటి పంచాంగం:
21 అక్టోబర్ 2022
దృగ్గణిత పంచాంగం

సూర్యోదయాస్తమయం : ఉ 06.01 / సా 05.43
సూర్య రాశి : తుల | చంద్ర రాశి : సింహం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం
తిథి : ఏకాదశి సా 05.22 ఆ తదుపరి ద్వాదశి
వారం : ‌శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : మఖ మ 12.28 ఆ తదుపరి పూర్వఫల్గుణి (పుబ్బ)
యోగం : శుక్ల సా 05.48 ఆ తదుపరి బ్రహ్మ
కరణం : బాలవ సా 05.22 కౌలువ (22) తె 05.47 ఆపై తైతుల

శుభాశుభ సమయాలు
వర్జ్యం : రా 08.56 – 10.37
దుర్ముహూర్తం : ఉ 08.22 – 09.08 మ 12.15 – 01.02
రాహు కాలం : ఉ 10.24 – 11.52
గుళిక కాలం : ఉ 07.29 – 08.57
యమ గండం : మ 02.47 – 04.15
ప్రయాణానికి శూల :‌ పడమర దిక్కుకు పనికిరాదు

సాధారణ శుభ సమయాలు
👉 ఉ 09.30 – 10.30 సా 05.00 – 06.00
అమృత కాలం : ఉ 09.53 – 11.37
అభిజిత్ కాలం : ఉ 11.29 – 12.15

వైదిక విషయాలు
ప్రాతఃకాలం : ఉ 06.01 – 08.22
సంగవకాలం : 08.22 – 10.42
మధ్యాహ్న కాలం : 10.42 – 01.02
అపరాహ్న కాలం : మ 01.02 – 03.22
ఆబ్ధీకం తిధి : ఆశ్వయుజ బహుళ ఏకాదశి
సాయంకాలం : సా 03.23 – 05.43
ప్రదోష కాలం : సా 05.43 – 08.10
నిశీధ కాలం : రా 11.27 – 12.17
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.23 – 05.12

ఈ రోజు (21-10-2022) శుక్రవారం రాశి ఫలితాలు

మేషం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మిధునం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది.

కర్కాటకం: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార,ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

సింహం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆప్తుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.

కన్య: వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాటపడవలసి వస్తుంది. దైవచింతన పెరుగుతుంది ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు.

తుల: వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆస్తుల వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది.

ధనస్సు: స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్థిరస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

కుంభం: ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

మీనం: కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దైవచింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సన్నిహితుల సాయం అందుతుంది.

Must Read: Karthika Deepam : టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వంటలక్క!