Zodiac Signs : అక్టోబర్ 17 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs: నేటి పంచాంగం: ➖➖➖✍️ 17 అక్టోబర్ 2022 దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయం : ఉ 06.00 / సా 05.45 సూర్య రాశి : కన్య/తుల | చంద్ర రాశి : మిధునం/కర్కాటకం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తిథి : సప్తమి ఉ 09.29 ఆ తదుపరి అష్టమి వారం : ‌సోమవారం (ఇందువాసరే) నక్షత్రం : పునర్వసు (18) తె 05.13 ఆ […]

  • Published On:
Zodiac Signs : అక్టోబర్ 17 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs:

నేటి పంచాంగం:
➖➖➖✍️
17 అక్టోబర్ 2022
దృగ్గణిత పంచాంగం

సూర్యోదయాస్తమయం : ఉ 06.00 / సా 05.45
సూర్య రాశి : కన్య/తుల | చంద్ర రాశి : మిధునం/కర్కాటకం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం
తిథి : సప్తమి ఉ 09.29 ఆ తదుపరి అష్టమి
వారం : ‌సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : పునర్వసు (18) తె 05.13 ఆ తదుపరి పుష్యమి
యోగం : శివ సా 04.02 ఆ తదుపరి సిద్ద
కరణం : బవ ఉ 09.29 బాలువ రా 10.44 ఆపైన కౌలువ

శుభాశుభ సమయాలు
వర్జ్యం : మ 03.44 – 05.31
దుర్ముహూర్తం : మ 12.16 – 01.03 & 02.37 – 03.24
రాహు కాలం : ఉ 07.28 – 08.56
గుళిక కాలం : మ 01.21 – 02.49
యమ గండం : ఉ 10.25 – 11.53
ప్రయాణానికి శూల :‌ తూర్పు దిక్కుకు పనికిరాదు

సాధారణ శుభ సమయాలు
👉 ఉ 06.00-07.00 & 11.00-12.00 సా 05.30-06.30
అమృత కాలం : రా 02.31 – 04.19
అభిజిత్ కాలం : ఉ 11.29 – 12.16

వైదిక విషయాలు
ప్రాతఃకాలం : ఉ 06.00 – 08.21
సంగవకాలం : 08.21 – 10.42
మధ్యాహ్న కాలం : 10.42 – 01.03
అపరాహ్న కాలం : మ 01.03 – 03.24
ఆబ్ధీకం తిధి : ఆశ్వయుజ బహుళ అష్టమి
సాయంకాలం : సా 03.24 – 05.45
ప్రదోష కాలం : సా 05.45 – 08.12
నిశీధ కాలం : రా 11.29 – 12.17
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.11

 

మేషం: సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది.

వృషభం: కీలక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు.

మిధునం: ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగండం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కర్కాటకం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు.

సింహం: కొన్ని వ్యవహారాలలో అవరోధాలు కలిగిన ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.సంఘంలో పలుకుబడి పెరుగుతుంది.

కన్య: కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ భారం తొలగుతుంది ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన విద్యాయత్నాలు సానుకూలమవుతాయి.

తుల: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు.బంధు, మిత్రులతో తగాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు కలుగుతాయి.

ధనస్సు: దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి.

మకరం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు అదిగమిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభలు అందుతాయి.

కుంభం: వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. బంధు వర్గంతో విభేదాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

మీనం: వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు అనుకోని ఖర్చులు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.

Must Read: Unstoppable season2:చంద్రబాబుతో బాలయ్య టాక్ షో మొదటి ఎపిసోడ్.!