Zodiac Signs : అక్టోబర్ 12 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs: నేటి పంచాంగం: ➖➖➖✍️ 12 అక్టోబర్ 2022 దృగ్గణిత పంచాంగం సూర్యోదయాస్తమయం : ఉ 05.59 / సా 05.48 సూర్య రాశి : కన్య | చంద్ర రాశి : మేషం/వృషభం ఈనాటి విశేషం: అట్లతద్దె చంద్రోదయోమావ్రతం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తిథి : తదియ రా 01.59 ఆ తదుపరి చవితి వారం : ‌బుధవారం (సౌమ్యవాసరే) నక్షత్రం : భరణి […]

  • Published On:
Zodiac Signs : అక్టోబర్ 12 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs:

నేటి పంచాంగం:
➖➖➖✍️
12 అక్టోబర్ 2022
దృగ్గణిత పంచాంగం

సూర్యోదయాస్తమయం : ఉ 05.59 / సా 05.48
సూర్య రాశి : కన్య | చంద్ర రాశి : మేషం/వృషభం
ఈనాటి విశేషం: అట్లతద్దె చంద్రోదయోమావ్రతం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం
శరదృతుః ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం
తిథి : తదియ రా 01.59 ఆ తదుపరి చవితి
వారం : ‌బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : భరణి సా 05.10 ఆ తదుపరి కృత్తిక
యోగం : వజ్ర మ 02.21 ఆ తదుపరి సిద్ధి
కరణం : వణిజ మ 01.39 భద్ర రా 01.59 ఆపైన బవ

సాధారణ శుభ సమయాలు
👉 ఉ 09.00 – 10.00 సా 04.00 – 06.00
అమృత కాలం : మ 12.11 – 01.51
అభిజిత్ కాలం : ఈరోజు లేదు

అశుభ సమయాలు
వర్జ్యం : (13) తె 05.56 – 07.38
దుర్ముహూర్తం : ఉ 11.30 – 12.17
రాహు కాలం : మ 11.54 – 01.22
గుళిక కాలం : ఉ 10.25 – 11.54
యమ గండం : ఉ 07.28 – 08.56
ప్రయాణానికి శూల :‌ ఉత్తర దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు
ప్రాతఃకాలం : ఉ 05.59 – 08.21
సంగవకాలం : 08.21 – 10.43
మధ్యాహ్న కాలం : 10.43 – 01.05
అపరాహ్న కాలం : మ 01.05 – 03.27
ఆబ్ధీకం తిధి : ఆశ్వయుజ బహుళ తదియ
సాయంకాలం : సా 03.27 – 05.48
ప్రదోష కాలం : సా 05.48 – 08.15
నిశీధ కాలం : రా 11.30 – 12.18
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.22 – 05.11

మేషం: దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

వృషభం: వృధా ఖర్చులు పెరుగుతాయి.దైవ చింతన కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇంటా బయట నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

మిధునం: ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. వ్యాపారమున లాభాలు పెరుగుతాయి.సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం: వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది.

సింహం: సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికి అవసరానికి ధనం అందుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

కన్య: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. భూ సంభంధిత వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

తుల: ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశములు అందుతాయి.

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కారమౌతాయి నూతన భూ గృహ యోగమున్నది.

ధనస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు.చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడితో నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన శిరోబాధను కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

మకరం: ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది ఉద్యోగాలలో రావలసి అవకాశాలు చేజారుతాయి కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు కలుగుతాయి.

కుంభం: సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహమున మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు విలువైన వస్తు లాభలు పొందుతారు.

మీనం: కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున కొన్ని వ్యవవహారాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

Must Read: Zodiac Signs : అక్టోబర్ 08 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!