Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు…(30-04-2023 నుండి 06- 05-2023 వరకు….)

Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు…. వృషభ రాశి.. ఈవారం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. దూర ప్రయాణాలు మంచివి కావు. ఉద్యోగంలో భారం పెరుగుతుంది. ఏ పని అయినా పట్టుదలతో పూర్తి చేయడం మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి.చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మిధున రాశి.. అనుకున్న పనులన్నీ అవుతాయి. విలువైన వస్తువులను కొంటారు. ఉద్యోగ రంగంలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. […]

  • Published On:
Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు…(30-04-2023 నుండి 06- 05-2023 వరకు….)

Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు….

weekly-horoscope-from-30th-april-to-06th-may

వృషభ రాశి..

ఈవారం ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోతాయి. దూర ప్రయాణాలు మంచివి కావు. ఉద్యోగంలో భారం పెరుగుతుంది. ఏ పని అయినా పట్టుదలతో పూర్తి చేయడం మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి.చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది.

మిధున రాశి..

అనుకున్న పనులన్నీ అవుతాయి. విలువైన వస్తువులను కొంటారు. ఉద్యోగ రంగంలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అకాల భోజనం వలన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. బాకీలు ఆలస్యంగా చేతికి అందుతాయి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారు వారం చివర్లో ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు తగిన ఫలితాన్ని పొందుతారు.

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆగిన పనులు ముందుకు వెళ్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విలువైన వస్తువుల పట్ల ఆసక్తి చూపిస్తారు. కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల తో వాగ్వాదాలొస్తాయి.

సింహరాశి…

అనుకున్న పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. లావాదేవీలు సజావుగా సాగిపోతాయి. పని వారి వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు.బంధువుల సఖ్యత లభిస్తుంది. పెద్దల సలహాలను పాటించడం మంచిది. విదేశీ విద్యా ప్రయత్నాల లో ముందడుగు వేస్తారు. అదృష్ట యోగం ఉంది. తొందరపాటు నిర్ణయాలు సరికావు.

కన్య రాశి..

వారం మొదట్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.అనాలోచిత నిర్ణయాల వలన నష్టపోతారు. ముఖ్యమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే మంచిది. ఉద్యోగ రంగం వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి సమయం పడుతుంది. కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది.

తులారాశి..

ఆదాయం పెరుగుతుంది. శ్రద్ధతో పనులను పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లడం మంచిది. ఆరోగ్యంగా ఉంటారు. పలుకుబడిని ఉపయోగించి పనులు పూర్తి చేస్తారు.

వృశ్చికరాశి. ..

నలుగురిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కళాకారులకు సరికొత్త అవకాశాలు రావచ్చు. పెద్దల సలహాలను పాటించడం మంచిది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. రాజకీయ మరియు కోర్టు వ్యవహారాలలో ఫలితాలను అందుకుంటారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనుస్సురాశి…

పని వారి వలన సమస్యలను ఎదుర్కొంటారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా వస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. పూర్తికాని పనులు కొలిక్కి వస్తాయి. కొత్త వస్తువులను కొనేందుకు మొగ్గు చూపుతారు.ఖర్చులను నియంత్రించుకోవాలి.

 

మకర రాశి…

ఈ రాశి వారికి అనుకూల వాతారణంం ఉంటుంది. అన్ని విషయాలలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పని భారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. కొద్దిగా ప్రయత్నం చేస్తే సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగరంగం వారికి తోటి వారితో విభేదాలు రావచ్చు. సంయమనంతో వ్యవహరించాలి.

కుంభరాశి..

అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. చదువులో ముందుంటారు. భక్తి పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం కలిసి వస్తుంది. చేసే పనిలో శ్రమ పెరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. భూమి కొనుగోలు పై మొగ్గు చూపుతారు. ప్రయోజనాలను పొందుతారు.

మీన రాశి…

శుభకార్యాలలో అందరి సహకారాన్ని పొందుతారు. వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది. బంధుమిత్రుల తో విభేదాలు రావచ్చు. పెద్దల సూచనలను పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కోర్ట్ విషయంలో అనుకూల ఫలితాలను అందుకుంటారు. ఎలాంటి సమస్య అయినా సంయమనంతో పరిష్కరించుకోవడం మంచిది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్లు దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.