Kalagnanam : బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం…ముందు ముందు ఏం జరుగుతుందంటే…

Kalagnanam : బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని  మనందరికీ తెలుసు. అయితే బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందుగానే గ్రహించి వాటిని తాళపత్ర గ్రంధాలలో పేర్కొనడం జరిగింది. అయితే గ్రంథాలలో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం లోని కొన్ని విషయాలు చాలావరకు జరిగాయి. దీంతో చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతో విశ్వసిస్తున్నారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకుతుందని బ్రహ్మంగారు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు […]

  • Published On:
Kalagnanam : బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం…ముందు ముందు ఏం జరుగుతుందంటే…

Kalagnanam : బ్రహ్మంగారు గొప్ప కాలజ్ఞాని  మనందరికీ తెలుసు. అయితే బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందుగానే గ్రహించి వాటిని తాళపత్ర గ్రంధాలలో పేర్కొనడం జరిగింది. అయితే గ్రంథాలలో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం లోని కొన్ని విషయాలు చాలావరకు జరిగాయి. దీంతో చాలామంది బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఎంతో విశ్వసిస్తున్నారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకుతుందని బ్రహ్మంగారు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు గట్టిగా వర్షాలు పడినట్లయితే వరదలు బీటలు పారి ఇంద్రకీలాద్రిని కృష్ణ నది తాకే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించదని బ్రహ్మంగారు చెప్పారు.

అలాగే చెన్నకేశవ స్వామి యొక్క మహిమలు నాశనం అవుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది. ఇక కృష్ణానది మధ్య బంగారు రథం పుడుతుందని…దానిని చూసిన వారి కళ్ళు పోతాయని చెప్పారు. అలాగే శ్రీశైలం పర్వతంపై ఒక ముసలి వస్తుందని ఇక ఆ ముసలి భ్రమరాంబ గుడిలో 8 రోజులు పాటు ఉండి మేకపోతుల అరుస్తుందని కాలజ్ఞానంలో తెలియజేశారు. అలాగే కామక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని, వేప చెట్టు నుండి అమృతం పుడుతుందని..ఇక శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్లు పడిపోతాయని అలా పడిన రాళ్లు ముక్కలు ముక్కలుగా లేచి ఆకాశాన ఎగురుతాయని తెలియజేశారు. అలాగే మనుషులు చేసే పాపాల వలన ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా వస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వ్రాసుకొచ్చారు.

ఇక ఆ పాపాలు ఎక్కువైనప్పుడు తాను మళ్ళీ జన్మిస్తానని తెలియజేశారు. ఇక ఆయన జన్మించినప్పుడు వచ్చే ఉపాధనలు కూడా సూచించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెబుతుండగా బనగానపల్లి నివాసి వాటిని తాళపత్ర గ్రంధాలలో రాసినట్టుగా కాలజ్ఞానంలో సూచనలు కూడా ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కలియుగం నడుస్తుంది. ఇప్పటికే భూమిపై పాపాలు పెరిగి కొత్త కొత్త రోగాలతో మనుషులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్లుగానే చాలావరకు జరుగుతుంది.