Zodiac Signs : అక్టోబర్ 05 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. ‘శ్రవణా’ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి “విజయ”అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయ దశమి’ అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రందము […]

  • Published On:
Zodiac Signs : అక్టోబర్ 05 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs

దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. ‘శ్రవణా’ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి “విజయ”అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయ దశమి’ అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే ‘విజయం ‘ అని తెలిపి యున్నది. ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.

‘శమీ పూజ’ చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే ‘జమ్మి చెట్టు’. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుదములను , వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న ‘అపరాజిత’ దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .

“శ్రీ రాముడు” ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా’ దేవిని పూజించి రావణుని సంహరించి , విజయము పొందినాడు. అదేంటంటే , శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి , నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా , ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని , శ్రీరామునికి విజయాన్ని కలుగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. నాటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి , విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి. పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ , అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ. శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా , ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా , తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.”

పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.

శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనస్సును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.

తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం’ అని చెప్పి పెట్టి , వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.

హైదరాబాద్ నగరంలో జమ్మికొమ్మ , ఆరె కొమ్మలకు ఉన్న ఆకులను బంగారు , వెండిగా పంచుతూ , శుభాకాంక్షలను తెలుపుకుంటారు. దీనినే ‘సోనా దేనా’ కార్యక్షికమంగా పిలుస్తారు. ప్రధానంగా జమ్మి , ఆరె ఆకులను పరస్పరం పంచుకొని , కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్షగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి , కుల , మత , లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని , హృదయాల్ని కలిపే సామాజిక ఐక్య తారాగానికి ప్రతీకగా భావిస్తారు.

మేషం: కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

వృషభం: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

మిధునం: ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం: ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి.

సింహం: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు.

కన్య: బందు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. నూతన ఋణయత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల: బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి.

వృశ్చికం: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

మకరం: ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.

కుంభం: సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి.బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.

మీనం: సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.

Must Read: Karthikeya 2’s OTT Release Date: కార్తికేయ 2 OTT విడుదల తేదీని ప్రకటించారు.