Post Office Policy : ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్న పోస్తాఫీస్ పథకాలు ఇవే ..

Post Office Policy :  మనం సంపాదిస్తున్న దాంట్లో ఎంతోకొంత భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకోవాలి. లేదంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆర్థికపరంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కొంతమందికి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక సతమాతమవుతుంటారు. ఇలాంటి వాళ్లకు పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా సురక్షితమైనవి. ప్రభుత్వం లాంగ్ టర్మ్ సేవింగ్స్ ప్రోత్సహించేందుకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ ను ప్రవేశపెట్టింది. ఇండియా పోస్ట్ అనేకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తుంది. ట్యాక్స్ […]

  • Published On:
Post Office Policy : ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్న పోస్తాఫీస్ పథకాలు ఇవే ..

Post Office Policy :  మనం సంపాదిస్తున్న దాంట్లో ఎంతోకొంత భవిష్యత్తు అవసరాల కోసం దాచిపెట్టుకోవాలి. లేదంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆర్థికపరంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే కొంతమందికి డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కాక సతమాతమవుతుంటారు. ఇలాంటి వాళ్లకు పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలా సురక్షితమైనవి. ప్రభుత్వం లాంగ్ టర్మ్ సేవింగ్స్ ప్రోత్సహించేందుకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ ను ప్రవేశపెట్టింది. ఇండియా పోస్ట్ అనేకరకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్ అందించే పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎన్నో ఉన్నాయి.

1) నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో ప్రస్తుతం 7% వడ్డీ రేటు ఉంది. ఇది పెట్టుబడిదారునికి టాక్స్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు, కనీస పెట్టుబడి రూ.100. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్సి లో రూ.1.50 లక్షల వరకు చేసిన డిపాజిట్‌లపై సెక్షన్ 80C కింద ట్యాక్స్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. కాలపరిమితి ఐదేళ్లు. అయితే మెచ్యూరిటీ టైం కి వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.

2) కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్తుకు రక్షణగా సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలుపరిచింది. ప్రస్తుతం ఈ స్కీమ్ సంవత్సరానికి 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. వార్షిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు. ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా 250 గరిష్టంగా 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 15 సంవత్సరాలపాటు డిపాజిట్ చేయవచ్చు.

3) 5 ఇయర్స్ పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీం ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఎఫ్టిలో తరహాలోని వడ్డీకి హామీ ఇస్తాయి. ఆర్థిక సంవత్సరానికి 1.5 లక్షల వరకు టాక్స్ పొందవచ్చు కనీస పెట్టుబడి ₹1000, గరిష్ట పరిమిత లేదు. ప్రస్తుతం ఈ పథకం 7% వడ్డీని అందిస్తుంది.

4) 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ స్కీంలో 8 శాతం వడ్డీ రేటు ఉంది. మెచ్యూరిటీ టైం ఐదేళ్లు ఉంది. ఈ స్కీంలో 1.5 లక్షల వరకు సెక్షన్ 80 సీ కింద టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Must Read : Trisha : త్రిష కొత్త ఇల్లు ఎక్కడుందో తెలుసా ..? ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే !