Children Health : వేసవిలో పిల్లలకు ఈ పదార్థాలు తినిపిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు… ఒక్కసారి ట్రై చేసి చూడండి..

Children Health : ఈరోజుల్లో చాలామంది పిల్లలు తరచు జలుబు , దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇక ఇలాంటి సమస్యలకు మందులు కాకుండా ఇంటి చిట్కాలు వాడడం చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు తినే ఆహారమే వారి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక వేసవికాలం వచ్చిందంటే పిల్లలు ఇంటి పట్టున ఉండకుండా ఎండల్లో తిరుగుతూ నీరసపడిపోతుంటారు. ఇలాంటి వాతావరణ మార్పుల వలన పిల్లల లో రోగనిరోధక శక్తి కూడా సన్నగిల్లుతూ వస్తుంది. […]

  • Published On:
Children Health : వేసవిలో పిల్లలకు ఈ పదార్థాలు తినిపిస్తే ఎలాంటి సమస్యలు దరిచేరవు… ఒక్కసారి ట్రై చేసి చూడండి..

Children Health : ఈరోజుల్లో చాలామంది పిల్లలు తరచు జలుబు , దగ్గు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇక ఇలాంటి సమస్యలకు మందులు కాకుండా ఇంటి చిట్కాలు వాడడం చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు తినే ఆహారమే వారి యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక వేసవికాలం వచ్చిందంటే పిల్లలు ఇంటి పట్టున ఉండకుండా ఎండల్లో తిరుగుతూ నీరసపడిపోతుంటారు. ఇలాంటి వాతావరణ మార్పుల వలన పిల్లల లో రోగనిరోధక శక్తి కూడా సన్నగిల్లుతూ వస్తుంది. ఫలితంగా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల యొక్క రోగ నిరోధకక శక్తిని మెరుగుపరచడం చాలా ముఖ్యం. వారి రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. పిల్లలకు పెట్టడంతో పాటు పెద్దలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినాలి. మరి అలాంటి ఆహార పదార్థాలలో ప్రధాన స్థానంగా భావించేది డ్రై ఫ్రూట్స్.. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రోగనిరోధక శక్తిని పెంచి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

feeding-these-ingredients-to-children-in-summer-will-not-lead-to-any-problems-just-try-it

feeding-these-ingredients-to-children-in-summer-will-not-lead-to-any-problems-just-try-it

బాదంపప్పు ….

డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పును ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అలాగే రోజు బాదంపప్పు తినడం వలన ,రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాక ఇది కొలెస్ట్రాలను నియంత్రించడంతోపాటు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అలాగే ఈ బాదంపప్పును నానబెట్టి పిల్లలకు రోజు ఇవ్వడం చాలా మంచిది.

వాల్ నట్స్ …..

వాల్ నట్స్ శరీరానికి అవసరమయ్యే ఒమేగా 3 ప్యాటి యాసిడ్స్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది. అలాగే దీనిలో కాల్షియం మాంగనీస్ పొటాషియం వంటి విటమిన్స్ కూడా ఉన్నాయి. పిల్లలకు రోజు వాల్ నట్స్ తినిపించడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు.

పిస్తా పప్పు…

దీనిలో ఇనుము, పొటాషియం, రాగి వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి.