Sowa Fish : చేపల కోసం వెళితే వరించిన అదృష్టం…రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిన మత్స్యకారుడు…

Sowa Fish : అదృష్టం అనేది ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో కలిసివస్తుందో అసలు ఊహించలేం. అదృష్టం పడితే కటిక పేదరికంలో ఉన్నవారు కూడా రాత్రికి రాత్రే లక్ష అధికారులు కోటీశ్వరులుగా మారిపోతారు. కానీ ఇలా కోట్లలో ఎవరికో ఒకరికి మాత్రమే కలిసి వస్తుంది. మరికొందరికి లంకె బిందెల రూపంలో కూడా ఈ అదృష్టం కలిసి వచ్చింది. అప్పుడప్పుడు కొందరు మత్స్యకారులకు కూడా చేపల రూపంలో అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. ఈ క్రమంలో కేవలం చేపలు […]

  • Published On:
Sowa Fish : చేపల కోసం వెళితే వరించిన అదృష్టం…రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిన మత్స్యకారుడు…

Sowa Fish : అదృష్టం అనేది ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో కలిసివస్తుందో అసలు ఊహించలేం. అదృష్టం పడితే కటిక పేదరికంలో ఉన్నవారు కూడా రాత్రికి రాత్రే లక్ష అధికారులు కోటీశ్వరులుగా మారిపోతారు. కానీ ఇలా కోట్లలో ఎవరికో ఒకరికి మాత్రమే కలిసి వస్తుంది. మరికొందరికి లంకె బిందెల రూపంలో కూడా ఈ అదృష్టం కలిసి వచ్చింది. అప్పుడప్పుడు కొందరు మత్స్యకారులకు కూడా చేపల రూపంలో అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. ఈ క్రమంలో కేవలం చేపలు అమ్మి లక్షలు సంపాదించిన వారు కూడా ఉన్నారు. అయితే అలాంటిది ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా సముద్రంలో వేట కోసం వెళ్ళిన మచ్చ కారుడికి అరుదైన చేపల లభించడంతో దానిని తీసుకువచ్చి వేలం వేయగా కోటి రూపాయల ధర పలికింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

Fisherman who becomes a millionaire overnight...

ఈ ఘటన పాకిస్తాన్ లోని అరాచీలో జరిగినట్లుగా సమాచారం. అదే ప్రాంతానికి చెందిన హజీ బలోచ్ అనే మత్స్యకారుడు అరేబియా సముద్రంలోకి సోమవారం రోజున చేపలు పట్టుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అతనికి అత్యంత అరుదైన చేప చిక్కింది. దీనిని గోల్డెన్ ఫిష్ అని పిలుస్తారు. స్థానికంగా దీనిని సోవా అని కూడా పిలుస్తారు. ఇక ఈ చేప బంగారు వర్ణంలో మెల మెల మెరుస్తూ ఉంటుంది. అంతేకాక ఈ చేపలోఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చెబుతుంటారు. ఇక ఈ చాప సుమారు 20 నుండి 40 కేజీల బరువు ఉంటుంది. దాదాపు 1.5 మీటర్లు పొడవు కూడా ఉంది.

ఇక ఈ చేపలు కేవలం సంతాన ఉత్పత్తి కాలంలో మాత్రమే సముద్ర తీరాలకు వస్తుంటాయి. అందుకే ఈ చేపలను అత్యంత అరుదైన చేపలుగా చెబుతుంటారు. అయితే ఈ చేపను శుక్రవారం కరాచీ నౌకాశ్రయంలో వేలం వేయగా పాకిస్తాన్ కరెన్సీలో దాదాపు 70 మిలియన్ రూపాయలకు ఇది అమ్ముడుపోయిందని సమాచారం. భారత కరెన్సీ ప్రకారం ఇది 7 కోట్ల వరకు ఉంటుంది. దీంతో మత్స్యకారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్నో చేపలు దొరికాయి కానీ ఇలాంటి చేప దొరకటం ఇదే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చారు. దీనిని అమ్మగా వచ్చిన డబ్బును నా టీమ్ లోని ఏడుగురితో సమానంగా పంచుకుంటా అంటూ ఆయన తెలిపారు.