Mallu Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన మల్లు భట్టి విక్రమార్క…మొదటి సంతకం ఆ ఫైల్ పైనే…
Mallu Bhatti Vikramarka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన మాట అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించగా… తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై మొదటి సంతకం చేశారు. అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ పై భట్టి విక్రమార్క రెండవ సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, […]
Mallu Bhatti Vikramarka : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన మాట అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించగా… తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు పథకానికి సంబంధించిన నిధుల విడుదలపై మొదటి సంతకం చేశారు. అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ పై భట్టి విక్రమార్క రెండవ సంతకం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ మంత్రిత్వ శాఖల బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వేద పండితుల నడుమ వేదమంత్రాలు సాక్షిగా ఛాంబర్ లోకి ప్రవేశించడం జరిగింది. అనంతరం బాధ్యతలు చేపట్టిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన 6 గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం సంబంధించిన ఫైల్ ను చూడడం జరిగింది.
ఇక మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలను ఆర్టీసీకి విడుదల చేసినట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తొలి సంతకం చేయడం జరిగింది. ఆ తర్వాత రాజు ఆరోగ్య శ్రీ ని 10 లక్షలకు పెంచుతున్న నేపథ్యంలో ఆ నిర్ణయానికి అనుగుణంగా 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు వీడియోలో చేస్తూ భట్టి రెండవ సంతకం చేశారు. అలాగే విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మూడవ సంతకం చేశారు. అదేవిధంగా సమ్మక్క సారలక్క జాతర ఏర్పాట్లకు గాను దాదాపు 75 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు మంజూరు చేసిన సిఫారసు ఫైల్ పై నాలుగో సంతకం చేశారు. ఇలా హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కో దానికి అవసరమైన నిధులను విడుదల చేస్తూ , ఎలాంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా కొనసాగించే దిశగా కాంగ్రెస్ సర్కార్ కార్యచరణ రూపొందిస్తున్నారు.