Jabardasth Naresh : పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్ నరేష్…అమ్మాయిని చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Jabardasth Naresh : జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారిలో జబర్దస్త్ కమెడియన్ నరేష్ కూడా ఒకరు. తనకున్న వైకల్యాన్ని ప్లస్ గా మార్చుకుని నరేష్ బుల్లితెరపై తన పేరును నిలబెట్టుకున్నారు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా మల్లెమాల ప్రొడక్షన్స్ లో వచ్చే ప్రతి ఈవెంట్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఇలా ప్రతి షోలో పాల్గొంటూ రెండు చేతుల దండిగా సంపాదిస్తున్నాడు. అయితే తాజాగా […]

  • Published On:
Jabardasth Naresh : పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్ నరేష్…అమ్మాయిని చూస్తే షాక్ అవ్వాల్సిందే…

Jabardasth Naresh : జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారిలో జబర్దస్త్ కమెడియన్ నరేష్ కూడా ఒకరు. తనకున్న వైకల్యాన్ని ప్లస్ గా మార్చుకుని నరేష్ బుల్లితెరపై తన పేరును నిలబెట్టుకున్నారు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా మల్లెమాల ప్రొడక్షన్స్ లో వచ్చే ప్రతి ఈవెంట్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఇలా ప్రతి షోలో పాల్గొంటూ రెండు చేతుల దండిగా సంపాదిస్తున్నాడు. అయితే తాజాగా నరేష్ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాట్లాడుతూ తాను ప్రేమలో ఉన్నట్లుగా గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లుగా, మరి కొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా ఓ అమ్మాయిని తీసుకువచ్చి పరిచయం చేశాడు. ఇక ఈ విషయం విన్న వెంటనే ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.

jabardasth-naresh-relationship-video-viral

అయితే తాజాగా విడుదలైన శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో ఇది హైలెట్ గా నిలిచింది. ఇక ఈ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ తనకంటూ లవ్ స్టోరీ ఉందని, నన్ను కూడా ఒకరు లవ్ చేశారంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాక ఆమెను స్టేజ్ పైకి ఆహ్వానించి అందరికీ పరిచయం చేశాడు. ఈ క్రమంలోని అందరి ముందు ఆమెకు రోజ్ ఇచ్చి మరోసారి ప్రపోజ్ చేశాడు నరేష్. అలాగే వాళ్ళ నాన్నని కూడా స్టేజ్ మైకే ఆహ్వానించి ఇద్దరు కలిసి వాళ్ళ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. నరేష్ నాన్న కూడా త్వరలోనే వీరికి పెళ్లి చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ న్యూస్ విన్న తర్వాత నేటిజనులు పలువురు పలు రకాలుగా స్పందిస్తూన్నారు.