Gaddi chamanthi : గడ్డిచామంతితో ఘనమైన ప్రయోజనాలు…ఆశ్చర్యపరిచే లాభాలు…

Gaddi chamanthi : పల్లెటూర్లో పొలాల గట్ల మధ్య మరియు మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా కనపడే గడ్డిచామంతి మొక్క అందరికీ తెలిసే ఉంటుంది. పొద్దు తిరుగుడు జాతికి చెందిన ఈ మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో ఆకు చివర రంపకు అంచులు కలిగి ఉంటాయి. ఈ మొక్కను సంస్కృతంలో జయంతి వేద అని పిలుస్తారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే ఈ మొక్కలను ప్రాంతాలవారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఈ విధంగా […]

  • Published On:
Gaddi chamanthi : గడ్డిచామంతితో ఘనమైన ప్రయోజనాలు…ఆశ్చర్యపరిచే లాభాలు…

Gaddi chamanthi : పల్లెటూర్లో పొలాల గట్ల మధ్య మరియు మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా కనపడే గడ్డిచామంతి మొక్క అందరికీ తెలిసే ఉంటుంది. పొద్దు తిరుగుడు జాతికి చెందిన ఈ మొక్క ఆకులు దీర్ఘ అండాకారంలో ఆకు చివర రంపకు అంచులు కలిగి ఉంటాయి. ఈ మొక్కను సంస్కృతంలో జయంతి వేద అని పిలుస్తారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే ఈ మొక్కలను ప్రాంతాలవారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఈ విధంగా వైశాల కర్ని , గడ్డిచామంతి, గయపాకు , రావణాసుర తల ఇలా రకరకాల పేరుతో దీనిని పిలుస్తుంటారు. అయితే భారతీయ సాంప్రదాయ వైద్యం ప్రకారం మన పూర్వీకులు ఎప్పటినుండో దీనిని వైద్యానికి ఉపయోగిస్తున్నారు. ఇక దీనిలో ఆల్కలాయిడ్లు, సోడియం ,పొటాషియం ,కాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి.

great-benefits-of-gaddi-chamanthi

అంతేకాక గడ్డిచామంతి ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటాయి . తద్వారా ఏదైనా గాయాలైనప్పుడు ఈ ఆకులను నలిపి రసం గాయం పై రాసినట్లయితే ఆ గాయం ఎలాంటి వైద్యం లేకుండానే త్వరగా నయం అవుతుంది. మన పూర్వీకులు ఈ విధంగానే వారి గాయాలకు దీనిని మందుగా ఉపయోగించేవారు. అంతేకాక ఈ ఆకు రసం దగ్గు జలుబు వంటి సమస్యలకు కూడా దివ్య ఔషధంలా పనిచేస్తుందట. అలాగే ఈ గడ్డిచామంతి ఆకులను మరి కొన్ని ఆకులు అలాగే నూనె జోడించి మిశ్రమం తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేసినట్లయితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. గడ్డిచామంతి ఆకు రసం మరియు గుంటగలగలరాకు అలాగే నల్ల నువ్వుల నూనెను సరి సమానంగా తీసుకొని వాటన్నింటినీ బాగా కలిపి సన్నని సెగపై వేడి చేసి ఆ మిశ్రమాన్ని జుట్టు కు రాస్తే ఆ సమస్య తగ్గుతుంది.

great-benefits-of-gaddi-chamanthi

అలాగే మధుమేహం వంటి సమస్యతో బాధపడేవారికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలలో వెళ్లడైంది. అలాగే చర్మవ్యాధులతో బాధపడే వారికి ఈ ఆకు రసం మంచి ఔషధం. అలాగే ఇంట్లో దోమలు బెడద ఉన్నట్లయితే ఈ ఆకులను ఎండబెట్టి వాటి ద్వారా పొగ వేస్తే దోమలు పారిపోతాయి. అలాగే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారికి ఈ మొక్క యొక్క మొత్తం భాగాన్ని సేకరించి మెత్తటి పేస్ట్ లా చేసి నడుము పై పట్టులా వేయాలి. ఇలా చేసినట్లయితే నడుము నొప్పి తగ్గిపోతుంది. అలాగే కీళ్ల నొప్పులు కండరాల నొప్పులకు కూడా దీని రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేను.