selifee with currency : ఏకంగా 14 లక్షల నగదుతో ఓ పోలీస్ అధికారి భార్య సెల్ఫీ…పై అధికారులకు తెలియడంతో వారిని ఏం చేశారో చూడండి…

selifee with currency : తన భార్య తీసిన ఒక సెల్ఫీ ఫోటో కారణంగా ఓ పోలీస్ అధికారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. దీంతో ఆ పోలీసు అధికారి బదిలీ కావాల్సి వచ్చింది. అంతలా ఏముంది ఆ సెల్ఫీలో అనుకుంటున్నారా… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 లక్షలు నోట్ల కట్టల తో తన భార్య మరియు పిల్లలు సెల్ఫీ దిగారు . ఇలా తన భార్య దిగిన సెల్ఫీ ఫోటో వైరల్ అవ్వడంతో పోలీసులు సదరు […]

  • Published On:
selifee with currency :  ఏకంగా 14 లక్షల నగదుతో ఓ పోలీస్ అధికారి భార్య సెల్ఫీ…పై అధికారులకు తెలియడంతో వారిని ఏం చేశారో చూడండి…

selifee with currency : తన భార్య తీసిన ఒక సెల్ఫీ ఫోటో కారణంగా ఓ పోలీస్ అధికారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. దీంతో ఆ పోలీసు అధికారి బదిలీ కావాల్సి వచ్చింది. అంతలా ఏముంది ఆ సెల్ఫీలో అనుకుంటున్నారా… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 లక్షలు నోట్ల కట్టల తో తన భార్య మరియు పిల్లలు సెల్ఫీ దిగారు . ఇలా తన భార్య దిగిన సెల్ఫీ ఫోటో వైరల్ అవ్వడంతో పోలీసులు సదరు అధికారి వ్యక్తి పై చర్యలు తీసుకున్నారు.పూర్తి వివరాల్లోకి వెళితే…. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ చోటుచేసుకుంది.

ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా , బెహత ముజావర్ పోలీస్ స్టేషన్ లో రమేష్ చంద్ర అనే వ్యక్తి ఎస్ ఐ గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల రమేష్ చంద్ర భార్య మరియు అతని పిల్లలు వారి ఇంట్లోనే బెడ్ పై 500 నోట్ల కరెన్సీ కట్టలని పెట్టి సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాక ఆ సెల్ఫీ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది.అంతేకాక ఈ ఫోటో వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారుల దృష్టికి చేరింది . దీంతో రంగంలోకి దిగిన అధికారులు రమేష్ చంద్ర పై విచారణ చేపట్టారు. వెంటనే అతని ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే వైరల్ అవుతున్న ఆ ఫోటోల లో అక్షరాల 14 లక్షల రూపాయల విలువైన నగదు ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ ఫోటోపై ఎస్ ఐ రమేష్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటో 2021 నవంబర్ 14 న తన కుటుంబ ఆస్తిని విక్రహించినప్పుడు తీసుకున్న నగదు అని చెప్పుకొచ్చాడు. దీంతో రమేష్ చంద్రకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక ఈ ఘటనపై మరో పోలీసు అధికారులు మాట్లాడుతూ… రమేష్ చంద్ర భార్య పిల్లలు సెల్ఫీ లో చూపించిన డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం అతను వేరే ప్రాంతానికి బదిలీ చేయబడ్డారు.పూర్తి సమాచారం దొరికేంత వరకు అతనిపై దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను మీడియాకు తెలియజేస్తామని అధికారులు తెలియజేశారు.