Sai Pallavi : సినీ ఇండస్ట్రీలో గ్రామర్ షో చేయకుండా స్టార్ హీరోయిన్ స్థాయికి అతి తక్కువ మంది మాత్రమే చేరుకుంటారు. అలా ఎదిగిన వారిలో ముందుగా మనకు గుర్తు వచ్చే ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య . ఇక ఈ జనరేషన్ లో అయితే సాయి పల్లవి అని చెప్పాలి. ఎలాంటి గ్లామర్ షో చేయకుండా అలాంటి గొప్ప పేరును పదిలం చేసుకుంది సాయి పల్లవి. అలాంటి సాయి పల్లవి గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే సాయి పల్లవి మొదటిగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఫిదా” సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో అందరికీ ఇట్టే పరిచయం అయిపోయింది. అయితే సాయి పల్లవి మాత్రమే ఇప్పటికి గ్లామర్ షో చేయకుండా తన స్టైల్ తో, డాన్స్ తో ,డైలాగ్స్ తో అభిమానులను సొంతం చేసుకుంది.
తమిళ్ మలయాళం చిత్రాలలో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిల కనిపిస్తుంది. ఆమె అందం మరియు టాలెంట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాక సాయి పల్లవి ని చాలామంది లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే పవర్ స్టార్ రేంజ్ లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి . సాయి పల్లవి తన సినీ జీవితం ప్రారంభం నుంచే ఎలాంటి బాడీ ఎక్స్పోజింగ్ చేయకుండా నటనకే ప్రాధాన్యతనిస్తూ కోట్ల మంది అభిమానులను కొల్లగొట్టింది. ఇక తనతో పాటు సినీ రంగంలో అడుగుపెట్టిన తోటి స్టార్ హీరోయిన్లు మాత్రం గ్లామర్ షో తో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంటే..సాయి పల్లవి మాత్రం నిండుగా వస్త్రాలతో కనిపించి అందరిని ఆకట్టుకుంటూ తన వైపు తిప్పుకుంది. అయితే సాయి పల్లవి తన బాడీ షో మరియు రొమాంటిక్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు.
అలాంటి సన్నివేశాలు నటించేందుకు కూడా ఆమె ఇష్టపడరు అని చెప్పాలి. కేవలం తాను చేయగలను అనుకున్న పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ, అలాంటి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. అయితే సాయి పల్లవి తన సినీ జీవితంలో ఒకే ఒక్క హీరోకి లిప్ కిస్ ఇచ్చిందట. ఆ లక్కీ పర్సన్ మరి ఎవరో కాదు అక్కినేని నాగచైతన్య. శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమాలో నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించారు. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఈ సీన్ కచ్చితంగా డిమాండ్ చేయడంతో సాయి పల్లవి తొలిసారిగా తన రూల్స్ ను బద్దలు కొట్టి ఇలా చేసేందుకు ఒప్పుకుందట. ఈ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మొత్తానికి ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. అంతేకాక ఈ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More