Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ ,మలయాళం కన్నడ ,హిందీ భాషల్లో మారుమోగుతున్న పేరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగినన రష్మికకు తమిళ్, హిందీ చిత్రాలలో మాత్రం ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇటీవల విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాలో హీరోయిన్గా రష్మిక నటించినప్పటికీ స్కోప్ లేని క్యారెక్టర్ లో రష్మిక వెలవెలబోయింది. ఒక ఈ సినిమా కూడా అంత భారీ విజయాన్ని దక్కించుకోలేకపోయింది. అలాగే బాలీవుడ్లో నటించిన రెండు సినిమాలు కూడా రష్మికకు అంతగాా సక్సెస్ ను అందించలేకపోయాయి. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించిన పుష్ప సినిమా మాత్రం రష్మిక కు మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది.
ఇక ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 లో కూడా రష్మిక ,నటించబోతుంది అన్న విషయం మనకు తెలిసిందే. దీనితోపాటు యానిమల్ హిందీ ప్రాజెక్ట్ ఒకటి , మరియు హీరో నితిన్ తో ఓ మువీ, అలాగే తెలుగు ,తమిళ్ , బైలింగు వల్ రెయిన్బో వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా రష్మిక నటిస్తుంది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న రష్మిక..తాజాగా తన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టింది. దీంతో రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రష్మిక మాట్లాడుతూ నేను సినిమాలో ఎంత ఎత్తుకు ఎదిగానో అంత గొప్ప స్థానంలో ఉన్నాను, అలాగే చాలా అవార్డులను కూడా అందుకున్నాను. కానీ నా ఎదుగుదలను నా గొప్పతనాన్ని చూసి నా తల్లిదండ్రులు ఆనందించడం లేదని చెప్పింది.
దానికి గల కారణం వారికి సినిమా రంగంపై అవగాహన లేకపోవడమేనని, నేను చేసే పని గురించి సినిమాలు గురించి అసలు వారికి ఏమీ తెలియదు. అసలు నేనేం చేస్తున్నాను అనేది నా తల్లిదండ్రులకు అర్థం కాని ఒక చదరంగం అని రష్మిక కామెంట్స్ చేసింది. నా పని గురించి వాళ్లకు తెలియకపోయినప్పటికీ వారి పూర్తి సహకారం మాత్రం నాకు లభించింది. నాకు ఏం కావాలన్న వారు చేస్తారని అందుకే నేను అనుకున్నది సాధించగలిగానని రష్మిక చెప్పుకొచ్చింది. అంతేకాక నేను సినిమాలోకి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు . వారు పడిన కష్టాలు ఏంటో నాకు తెలుసు , అందుకే నా తల్లిదండ్రులు గర్వించే స్థాయికి చేరుకోవాలంటే సాధించాల్సింది ఇంకా చాలా ఉందంటూ రష్మిక చెప్పవచ్చింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More