Keerthy Suresh : దక్షిణాది సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. కీర్తి సురేష్ ఒక పక్క హీరోయిన్గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా చేస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పై పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. మరి వాటిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ముఖ్యంగా ప్రేమ , ప్రేమికుడు గురించి కీర్తి సురేష్ పై చాలా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను తెలుసుకున్న కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి వార్తలు విన్నప్పుడు బాదేస్తుందని చెప్పుకొచ్చింది.
ఇక ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా చూస్తే ఈ మధ్యకాలం వరకు తెలుగు ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా నటించిన ఈ అమ్మడు ,ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ నటిస్తున్న తమిళ్ సినిమాలలో “మామన్నన్” ఒకటి. ఇక ఈ సినిమాకు హీరోగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు “ఉదయనిది స్టాలిన్” నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కీర్తి సురేష్ సినీ ప్రచారాలలో భాగంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పలు రకాల ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే కీర్తి సురేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ….ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో కొనసాగుతుంది అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర అని తెలియజేసింది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని హొస్ట్ అడుగగా ఆ విషయం గురించి ఆలోచించాల్సి ఉంది అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉంటే గతంలో కీర్తి సురేష్ బీజేపీ పార్టీలో చేరుతుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వాటికి సమాధానంగా కీర్తి సురేష్ తల్లి నా కూతురికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ స్పష్టం చేసింది. మరల ఇప్పుడు కీర్తి సురేష్ పై వస్తున్న ఈ వార్తలపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More