MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్రసింగ్ ధోని కి ఉన్న ఫాలోయింగ్ గురించి భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. భారతదేశంలో ఐపీఎల్ సీజన్ లో చెన్నై తరపున బరిలోకి దిగిన ధోని ఏ రాష్ట్రానికి వెళ్లిన అభిమానులు అయనకు బ్రహ్మరథం పడతారు. కేవలం చెన్నై స్టేడియం మాత్రమే కాకుండా ఏ స్టేడియం అయినా సరే స్టేడియం మొత్తం పసుపు జెండాతో నిండిపోవడం ఖాయం. దీనికి గల ఒకే ఒక్క కారణం నెంబర్ 7 మహేంద్రసింగ్ ధోని అనే చెప్పాలి. ధోని బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు స్టేడియం మొత్తం లైట్స్ వేస్తూ అరుపులతో దద్దరిల్లిపోతుంది .
అయితే ఈ సీజన్ లో కూడా చెన్నై టీంకు సారథ్యం వహించిన ధోని టీమ్ కి ఐదవ సారి టైటిల్ సాధించి పెట్టాడు. భారతదేశవ్యాప్తంగా ధోనికి ఎంతమంది అభిమానులు ఉన్నారో మాటల్లో చెప్పలేం. అయితే సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపించే ధోని సడన్ గా కనిపిస్తే ఇకా ఆ వీడియో ఎంత వైరల్ అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం క్రికెట్ కు కాస్త విరామం ప్రకటించిన ధోని ఇటీవల ఓ విమానంలో కనిపించాడు. దీంతో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే విమానంలో తన సీట్ లో కూర్చుని ధోని క్యాండీ క్రష్ గేమ్ ఆడుతున్నారు. ఇంతలో హెయిర్ హోస్టర్స్ చాక్లెట్లతో ఉన్న ఓ ట్రేను పట్టుకుని ధోని వద్దకు వచ్చింది.
ఎయిర్ హోస్టేస్ తీసుకువచ్చిన ఆ ట్రే చూసిన ధోని చిరునవ్వు నవ్వి ఒక చాక్లెట్ తీసుకున్నాడు. ఇంకా తీసుకోండి అంటే ఒకటి చాలని సైగ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షల వ్యూస్ అందుకుంది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ధోని దెబ్బకు క్యాండీ క్రష్ డౌన్లోడ్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అంతేకాక క్యాండీ క్రష్ లో ధోని ఏ లెవెల్ లో ఉన్నాడో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More