Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా నెట్ ఇంట్లో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా జంతువులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తాజాగా కర్ణాటక లో ఓ చిరుత దారి తప్పి గ్రామంలోకి ప్రవేశించింది. కానీ అది అనుకోకుండా బావిలో పడిపోయింది. పడిన తరువాత గట్టిగా అరవడం ప్రారంభించింది. దీనిని గమనించి గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు.
రంగంలో దిగిన అధికారులు చిరుతను కాపాడే ప్రయత్నం చేశారు. చిరుత పైకి ఎక్కడానికి ముందుగా బావిలోకి ఒక నిచ్చెన ను వేశారు. కానీ మనుషులని చూసి భయపడి పోయిన చిరుత బయటికి రాకుండా బావిలోనే ఉండిపోయింది. దీంతో గ్రామస్తుల సహకారంతో ఓ పెద్ద కర్రకు నిప్పు అంటించి బావిలోని చిరుతను ఓవైపు నుంచి బెదిరించారు. దీంతో చిరుత నిచ్చెన ద్వారా పైకి ఎక్కింది. ఎట్టకేలకు చిరుత బావిలో నుంచి బయటపడడంతో అధికారులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
బావిలో నుంచి బయటికి రాగానే చిరుత అడవిలోకి పారిపోయింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో మూడు రోజుల క్రితం పోస్ట్ చేశారు. అయితే జంతువులను రక్షించే క్రమంలో ఒక్కోసారి విభిన్నమైన ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అని అధికారులు వెల్లడించారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ వీడియోకు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. చిరుతను రక్షించినందుకు అధికారులకు నెటిజన్స్ ధన్యవాదాలు తెలిపారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More