Akhil Akkineni : ‘ అఖిల్ ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని వారసుడు అఖిల్ ఇంతవరకు సరైనా హిట్ కొట్టలేకపోయాడు. తాను చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పూజ హెగ్డే సినిమా క్రెడిట్ అంతా కొట్టేసింది. అఖిల్ తన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత ప్రయత్నిస్తున్న స్టార్ హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇక త్వరలోనే అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. అంతేకాకుండా సినిమాలో సిక్స్ ప్యాక్ తో కూడా కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అఖిల్ గట్టిగానే తిరుగుతున్నాడు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడలో ఒక షాపింగ్ మాల్ మీద నుంచి తాళ్లతో కిందకు దూకాడు అఖిల్. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే అఖిల్ ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాకు అసలు అక్కినేని వారసత్వం వద్దు, అక్కినేని వారసుడిగా ప్రేక్షకులు అనుకుంటే నేను వారసత్వానికి అనుగుణంగా కొన్ని సినిమాలు మాత్రమే చేయాల్సి వస్తుంది.
అక్కినేని పేరు ఉంచుకుంటే నన్ను అఖిల్ గా ఎవరు చూడడం లేదు. మొదటినుంచి అఖిల్ గానే ఉండాలని కోరిక. అందుకే నాకు అక్కినేని ఇంటిపేరు వద్దు, అఖిల్ గానే నన్ను చూడండి, అలానే సినిమా కూడా చూడండి అని అన్నాడు. నా సొంత నిర్ణయాల మీద బతుకుతాను. సక్సెస్ అయిన ఫెయిల్ అయిన అఖిల్ కే ఇవ్వండి అని అక్కినేనికి మాత్రం ఇవ్వద్దు అని అన్నాడు. అంటే నన్ను అక్కినేని నాగార్జున కొడుకుగా చూడొద్దని కేవలం అఖిల్ గానే చూడాలని చెప్పాడు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More