Business Ideas : సొంత ఊరిలో కాలు మీద కాలేసుకుని కూర్చుని చేసే బిజినెస్ ఇదే ..!!

Business Ideas  : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొందరు ఎటువంటి బిజినెస్ చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటివారికి ఈ బిజినెస్ చక్కగా ఉపయోగపడుతుంది. సొంత ఊరులో పెట్టుబడి తక్కువతో ఈ బిజినెస్ ను మొదలు పెట్టవచ్చు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండే వారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుది. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఒక్కరు తేనె వినియోగించడం కనిపిస్తుంది. కానీ తేనె సరఫరా మనదేశంలో ఎక్కువగా జరగడం లేదు. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. గిరిజనులు అటవీ ప్రాంతాల నుంచి సేకరించి అమ్ముతుంటారు. తేనెను ఆయుర్వేద మందులలో విరివిగా వాడుతూ ఉంటారు. అలాగే చంటి పిల్లలకు తేనె తాగించడం చాలా మంచిదని మన పెద్దలు చెబుతుంటారు.

అలాంటి తేనె ని మన బిజినెస్ గా మార్చుకుంటే లాభాలను పొందవచ్చు. తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి ఒక అద్భుతమైన వ్యాపారం అని చెప్పవచ్చు. ఈ వ్యాపారానికి సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది. అంతేకాదు పెద్దగా భూమి కూడా అవసరం లేదు. తేనెటీగల పెంపకంలో నైపుణ్యం పెంచుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా తేనెటీగల పెంపకానికి ఖాళీ ప్రదేశాలు, తోటలు అయితే సరిపోతాయి. తేనెటీగలను పెంచేందుకు ప్రత్యేకమైన బాక్సులను తయారు చేసుకోవాలి. దేశంలో ఇండియన్ హైవ్ బీస్, రాక్ బీ, లిటిల్ బీస్, యూరోపియన్ మరియు ఇటాలియన్ బీస్ తేనెటీగల పెంపకానికి అనువైనవి.

తేనెటీగల పెంపకానికి సమీపంలో పండ్ల తోటలు, పూల తోటలు ఉంటే మంచిది మంచి మకరందం వాటికి దొరుకుతుంది. అప్పుడు తేనె ఉత్పత్తి కూడా పెరుగుతుంది. తేనెటీగలను పెంచే బాక్స్ కింద మంచినీటి తొట్లను ఏర్పాటు చేస్తే మంచిది. ఎండాకాలంలో మంచినీరు దొరకకపోతే తేనెటీగలు చనిపోతాయి. అలాగే తేనె ఉత్పత్తిని జరిగిన తర్వాత వాటిని ప్యాకింగ్, మార్కెటింగ్ చేసేందుకు గోడౌన్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. తేనెను నేరుగా సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్ లలో అమ్ముకోవచ్చు. అలాగే నగరాలలో హోల్సేల్ మార్కెట్లలో ఓ షాపును అద్దెకు తీసుకొని ఈ అమ్మితే మంచిది. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More