Health benifits after 30 :  30 ఏళ్ళు దాటినాక కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇవి పాటించకపోతే ఇక అంతే..

Health benifits after 30 :  కడుస్తున్న కాలంతో పాటు మన వయసు కూడా పెరుగుతుంది. అయితే మన శరీరంలో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఆహారం, ఒత్తిడి వ్యాయామం, నిద్ర , వీటన్నిటిని బ్యాలెన్స్ గా మెయింటెన్ చేయగలిగితే వయసు సమస్య కు దూరం గా ఉంటుంది. అయితే ఈ నాలుగిటిలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో 30 ఏళ్ళు తర్వాత ఒత్తిడిలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, భార్య పిల్లలు ,అంటూ శారీరక మరియు మానసిక ఒత్తిడికి గురవుతారు.బిపి, షుగర్ కీళ్ల జబ్బులు వంటివి కూడా 30 ఏళ్ళ తర్వాతనే మెల్లిగా ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే తప్పనిసరిగా ఆహారంలో కొన్ని అలవాటు చేసుకోవాలి. దీనివలన మీ వయసు సంఖ్య పెరుగుతుంది కానీ మీరు మాత్రం యవ్వనంగానే కనిపిస్తారు. 30 ఏళ్లు దాటిన తర్వాత మనం తీసుకునే ఆహారం తదుపరి 15 ఏళ్లు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అయితే 30 ఏళ్ళు దాటిన తర్వాత తప్పని సరిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్ ఉన్న ఆహారాలు..

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వలన గుండే జబ్బులు గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్ కోలోరెక్టల్ క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మన శరీరానికి రోజు 31 గ్రాముల ఫైబర్ అవసరమవుతుంది. పండ్లు కూరగాయలు తమ ధాన్యాలు చిక్కుళ్ళు వంటివి తీసుకోడం వలన మనకు ఫైబర్ లభిస్తుంది.

ఒమేగా 3 కొవ్వులు….

కొవ్వులు మానసిక ఆరోగ్యాన్ని మంచిగా ఉండేలా చేస్తాయి. అంతేకాక మెదడు పని తిరును కూడా మెరుగుపరుస్తుంది. అయితే సాల్మన్ చేప లో ఈ ఒమేగా కొవ్వులు అధికంగా ఉంటాయి. అలాగే వాల్ నట్స్ చియా సీడ్స్ లో కూడా ఒమేగా 3 ఎక్కువ గా ఉంటుంది. కావున మన ఆహారం లో వీటిని చేర్చుకోడం మంచిది.

కాల్షియం..

వయసు పెరిగే కొద్దీ మన ఎముకల బలం తగ్గుతుంది. అది ముఖ్యంగా 30 ఏళ్ళ తర్వాత ఎముకల బలహీనత ఎక్కువ అవుతుంది. అందుకే కాల్షియం పుష్కలంగా తీసుకోడం మంచిది. దీనికోసం మనం తినే ఆహారంలో పెరుగు , పన్నీరు, బ్రోకలీ, బచ్చలకూర బాదం ,వంటివి అదనంగా తీసుకోవాలి.

ప్రోటీన్స్..

మన శరీరంలో కండరాల దృఢంగా ఉండాలన్న, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు గాయాలు వెంటనే తగ్గిపోవాలి అంటే ప్రోటీన్స్ యొక్క పాత్ర కచ్చితంగా ఉండాలి. మరీ ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ఇది మరింత అవసరం. రోజు లో సహజంగా పురుషులకు 55 గ్రాములు ప్రోటీన్, స్త్రీలకు అయితే 45 గ్రాములు ప్రొటీన్ అవసరం ఉంటుంది. ఇక ఈ ప్రొటీన్ కోసం గుడ్లు ,చికెన్, పాలు, వంటి ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More