Tollywood : అచ్చమైన తెలుగింటి ఆడపిల్ల ఈ అమ్మాయి..ఒక్క మాటలో చెప్పాలంటే కుందనపు బొమ్మ అంటే ఇలానే ఉంటుందా అన్నట్లుగా ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఇప్పటికే పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ రచ్చ చేస్తూ ఉంటుంది. నిత్యం తన లేటెస్ట్ ఫోటోస్ వీడియోస్ ను తన సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే అందం అభినయం ఉన్న ఈ తెలంగాణ అమ్మడుకు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదని చెప్పాలి .
ఈమె చేసింది రెండు మూడు సినిమాలు అయినా భారీ అభిమానులను సొంతం చేసుకుంది. లంగా వోణీ లో మరింత అందంగా ముస్తాబైన ఆ ముద్దుగుమ్మ ఎవరంటే.. అనన్య నాగళ్ళ… తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన అనన్య 2019లో మల్లేశం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టకముందు ఈమె హైదరాబాద్ లోని రాజమహేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసి తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. మల్లేశం సినిమాలో అవకాశం రావడంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత ప్లే బ్యాక్, వకీల్ సాబ్ చిత్రాలలో నటించింది.
ఇక ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో రాబోతున్న శాకుంతలం సినిమాలో కూడా నటిస్తోంది. అయితే అనన్యకు అందం టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు అనుకున్నంత గుర్తింపు అయితే లభించలేదు. తన మొదటి సినిమాలో కథానాయకగా మెప్పించినప్పటికీ మరల కథానాయకగా చేసే అవకాశం దొరకలేదు. దీంతో పలు చిత్రాలలో కీలకపాత్రలో నటిస్తూ వస్తుంది అనన్య. ఈ క్రమంలో షూటింగ్ సెట్స్ లో లంగా ఓని లో కనిపించి సందడి చేసింది. ఇక ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో మై లవ్ అని కాప్షన్ పెట్టి పోస్ట్ చేయగా ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More