Pigeon : అప్పుడెప్పుడో మన పూర్వీకులు పావురాలను గూడచర్యం కోసం ఉపయోగించేవారని మనం పుస్తకాలలో చదువుకున్నాం. పావురాలు వందల కిలోమీటర్ల దూరంలో వదిలిన తిరిగి తమ గమ్యస్థానానికి వస్తాయి. అందువలన శత్రు దేశపు రహస్యాలను తెలుసుకునేందుకు వీటిని ఉపయోగించే వారట. క్రమక్రమంగా వీటి వినియోగం కనుమరుగైపోయింది. అప్పట్లో పావురాలతో ఉత్తరాలను కూడా పంపించేవారు. తర్వాత తర్వాత టెక్నాలజీ పెరుగుతుండడంతో పావురాలను వినియోగించడం మానేశారు. అయితే ప్రస్తుతం అలాంటి పావురాలు దర్శనం ఇవ్వడం కలకలం రేపుతుంది.
ఒడిస్సాలో గూడచారి పావురం మత్స్యకారుల కంటపడింది. దీని కాళ్లకు కెమెరా, మైక్రో చిప్ అమర్చి ఉండడంతో వెంటనే పోలీసులకు అప్పగించారు. ఒడిస్సా తీరంలో కొద్దిరోజుల క్రితం మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఆ సమయంలో ఓ పావురం పదేపదే వాళ్ళ చుట్టూ తిరుగుతూ చక్కెర్లు కొడుతుంది. అది మరింత కిందగా పయనించడం, వచ్చి వారి బోటుపై వాలడంతో వెంటనే దాన్ని బంధించారు. దాన్ని పరిశీలించగా కాళ్లకు కెమెరా, మైక్రో చిప్ అమర్చినట్లు గుర్తించారు. అనుమానం వచ్చిన మత్స్యకారులు ఆ పావురాన్ని పోలీసులకు అప్పగించారు.
పావురాన్ని పరిశీలించిన పోలీసులు దీనిని గూడచర్యం కోసం ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పావురం రెక్కల పై ఏదో అర్థం కాని భాష ఉందని, దాని కాళ్లకు చిప్ కెమెరా ఉందని జిల్లా ఎస్సై తెలిపారు. పదేపదే గూఢచర్యపు పావురాలు కంట పడుతుండడంతో దేశానికి ఏదైనా ముప్పు కలగబోతుందా, సరిహద్దుల్లో శత్రువులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అనుమానాలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం గోవాలో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్ సరిహద్దుల్లో రక్షణ దళాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం గమనార్హం. ఇది జరిగిన రెండు రోజులకే గూడచారి పావురాలు కంటపడడంతో అనుమానాలు నిజం అయ్యేలా ఉన్నాయి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More