Viral video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇంకా కొన్ని వీడియోలు ఆలోచింపచేస్తాయి. ఇలా ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం సోదరుడు పెళ్లిలో తన సోదరి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇటీవల బ్రిటన్ కు వెళ్లిన సోదరి తన సోదరుడు పెళ్లికి హాజరై అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
డిసెంబర్లో జరిగిన ఈ పెళ్లి వీడియోను సోదరి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా కోట్లాదిమంది వీక్షించారు. శ్రద్ధ సెల్లార్ అనే యువతి ఇటీవల బ్రిటన్ కు వెళ్ళింది. అయితే ఇండియాలో ఉన్న తన సోదరుడికి వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికి హాజరు కాలేనేమో అని అనుకుంది. ఎలా అయినా సోదరుడి పెళ్లికి వెళ్లాలి అనుకోని డిసైడ్ అయింది. వెంటనే భారత్ కు బయలుదేరింది. పెళ్లికి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే తమ కూతురు వివాహానికి రాదని భావించిన తల్లిదండ్రులు, సోదరుడు ఆమె రాకతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇక ఈ వీడియోని వీక్షించిన చాలామంది వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. పెళ్లికూతురుపై బంధువులకు ఉండాల్సిన దృష్టి అంత మీరు మీ వైపుకు తిప్పుకున్నారని కొందరు కామెంట్స్ చేశారు. అలాగే ఈ వీడియోలో కుటుంబం సభ్యుల మధ్య కనబడిన అనుబంధాలు కంటతడి పెట్టిందని కామెంట్లు చేశారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఈ వీడియో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను మూడు లక్షల మంది వీక్షించారు. 44వేల లైకులు వచ్చాయి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More