Viral Video : కేరళకు చెందిన పరంబిల్ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా స్విట్జర్లాండ్ లో ఉంటున్నాడు. ఐదేళ్ల తర్వాత ఇండియాకు తిరిగి రాగ…క్షీణించిన తల్లి ఆరోగ్య పరిస్థితి చూసి తల్లడిల్లిపోయాడు. ఇక ఎటు నడవలేని పరిస్థితిలో ఉన్న తన తల్లిని బయటకు తీసుకెళ్లేందుకు పరంబిల్ చేస్తున్న ప్రయత్నం అందర్నీ ఆకర్షిస్తుంది. అంతేకాక తన తల్లిని చేతులతో ఎత్తుకొని వెళ్లి కారులో కూర్చోబెడుతున్న దృశ్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తన తల్లితో హ్యాపీగా గడుపుతున్న మధుర క్షణాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
తల్లితో ఉన్న అనుబంధాన్ని పరంబిల్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. కొన్నేళ్ల క్రితం మా అమ్మకు యూరప్ చూపించేందుకు స్విట్జర్లాండ్ తీసుకెళ్లానని ,కొత్త ప్రదేశాలను చూసి ఆమె చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిందని, కానీ ఐదేళ్ల క్రితం కోవిడ్ రావడంతో ఆమెను ఇండియాకు పంపించానని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు మా అమ్మను చూస్తుంటే చాలా బాధేస్తుంది. తెల్లని జుట్టుతో చాలా ముసలి దానిలా అయిపోయింది. అంతేకాక తను చాలా విషయాలను మర్చిపోయింది.
కానీ నేను ఇంకా మర్చిపోలేదు. అందుకే ఇలాంటి పరిస్థితుల లో ఉన్న మా అమ్మను బయటకు తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యానని పరంబిల్ ఇంస్టాగ్రామ్ వేదికగా రాసుకోచ్చాడు. ఆమెను కారులో ఎక్కించుకొని అతిరంపుజా వీధుల్లో తిప్పుతుంటే ఆమె చాలా సంతోషించింది. ఇక ఈ మధుర క్షణాలను వీడియో తీసి విదేశాల్లో ఉన్న నా తోబుట్టువులకు పంపించాను అని పరాంబిల్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు ఫిదా అవుతున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More