Gay couple expecting their first baby: అమిత్ న్యూజెర్సీకి చెందిన గుజరాతీ అమెరికన్. ఆదిత్య మాదిరాజు ఢిల్లీకి చెందిన తెలుగబ్బాయి. వీరిద్దరూ 2016లో ఓ ఫ్రెండ్ పెళ్లిలో కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2019లో అందరిని ఒప్పించి హిందూ సాంప్రదాయంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అయితే ఇటీవల అమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకున్నారు. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నమంటూ తెలిపారు.
అయితే ఇద్దరు మగాళ్లే అయినప్పుడు బిడ్డకు ఎలా జన్మనిస్తారని అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. అయితే వీళ్లు సరోగ్రసీ, కృత్రిమ గర్భధారణ వంటి వాటిపై చాలానే అధ్యయనాలు చేశారు. అండం దానం చేసే వారి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు వారికి ఒక డోనర్ దొరకడంతో వారి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం చెబుతూ మేము ఎప్పటిలాగే స్వలింగ సంపర్క జంటల గురించి మాట్లాడము, కేవలం జంటల గురించి మాట్లాడుతాం అంటూ అమిత్ షా చెప్పుకొచ్చాడు.
మేము స్వలింగ సంపర్క తల్లిదండ్రులుగా ఉండము, కేవలం తల్లిదండ్రులుగా మాత్రమే ఉంటామని ఆదిత్య చెప్పుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. మరికొందరు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మీ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాం అని కామెంట్లు పెట్టారు. మరికొందరు చాలామంది గే జంటలకు మీరు ఆదర్శం అంటూ కామెంట్లు చేశారు. మీ పోస్ట్ చూశాక మేము ఎంతో ఎమోషనల్ అయ్యాము. మీరు మంచి తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్నాం అని కామెంట్లు పెట్టారు.
Must Read: cow dung tractors: రైతులకు గుడ్ న్యూస్ .. ఆవు పేడతో నడిచే టాక్టర్లు వచ్చేసాయ్ ..
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More